Deepak Hooda: దీపక్ హుడా.. ఐపీఎల్ లో నాడు పంజాబ్ తరుఫున.. ఇటీవల లక్నో తరుఫున ఆడిన ఈ ఆటగాడు ఐపీఎల్ లో దంచికొట్టాడు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన హుడా ఇప్పుడు అవకాశాన్ని చేజేతులా అందిపుచ్చుకున్నాడు. ఏకంగా ఫాం కోల్పోయి తంటాలు పడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సీటుకే ఎసరు పెడుతున్నారు.
తాజాగా ఇంగ్లండ్ తో ఇండియా మూడు టీ20లలో తలపడుతోంది. మొదటి టీ20లో ఇండియా అదరగొట్టింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు రాత్రి రోజ్ బౌల్‌లో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాటర్ హుడా 194.11 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టాడు. సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్ దీపక్ హుడా మరో ప్రభావవంతమైన నాక్‌తో అత్యున్నత స్థాయిలో భారత్ భారీ స్కోరుకు బాటలు వేశాడు.
Also Read: Naresh-Pavitra Lokesh Marriage Controversy: పవిత్రా- నరేష్ పై మరో ప్రూఫ్ విడుదల.. ఆడేసుకుంటున్నారు
మూడో ఓవర్‌లో నం. 3లో బ్యాటింగ్‌కు వచ్చిన హుడా 194.11 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. మూడో నంబర్ లో వచ్చి ఈ స్థాయిలో స్టైక్ రేటుతో కొట్టిన తొలి ఆటగాడు హుడానే కావడం ఒక రికార్డుగా చెప్పొచ్చు. మూడు ఫోర్లు-రెండు సిక్సర్ల సహాయంతో స్ట్రోక్‌తో 33 (17 బంతుల్లోనే) పరుగులు చేశాడు.
గత నెలలో ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో సెంచరీ సాధించిన హుడా.. ఇంగ్లండ్ తోనూ అదే ఊపు కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా ఆల్-రౌండర్ మొయిన్ అలీ బౌలింగ్ పై ముప్పేట దాడి చేశారు. ఐదో ఓవర్ మొదటి డెలివరీలో హుడా ట్రాక్‌లో డ్యాన్స్ చేస్తూ లాంగ్ ఆన్ ఆన్ లో సిక్సర్ కొట్టాడు. తర్వాతి డెలివరీలో కూడా రిస్క్ తీసుకోవడానికి భయపడలేదు. నిర్భయమైన హుడా రెండు వరుస సిక్సర్లు కొట్టి ఊపు తెచ్చాడు.
తర్వాతి ఓవర్‌లో ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లీని ఎదుర్కొన్న హుడా మూడు ఫోర్లు కొట్టడంతో భారత్ పవర్‌ప్లేలో 66/2 స్కోర్ చేసింది. సరైన సమయంలో ఫ్లిక్ ఆడడం ద్వారా భారత్ భారీ స్కోర్ కు హుడా బాటలు వేశాడు. ఓపెనింగ్ బ్యాటర్లు రోహిత్ శర్మ (24), ఇషాన్ కిషన్ (8)లను కోల్పోవడంతో నెమ్మదిగా సాగిన భారత్ కు హుడా బ్యాటింగ్ గొప్ప బూస్ట్ లా మారింది.
-దీపక్ హుడా ఐపీఎల్ 2022 రికార్డు
27 ఏళ్ల హూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో అత్యధిక పరుగులు చేసిన 10వ ఆటగాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. హుడా 451 పరుగులు సగటు.. స్ట్రైక్ రేట్ 32.21.. 136.66తో నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ (2015), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2016-2019), పంజాబ్ కింగ్స్ (2020-2021) ఐపీఎల్ సీజన్ లలో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. హుడాకు ఇప్పుడు టీమిండియా తరుఫున ఆడే అవకాశం లభించింది. ప్రారంభంలోనే అదరగొడుతున్నాడు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ కెరీర్-బెస్ట్ సీజన్‌ను ఈ సంవత్సరం నమోదు చేయగలిగాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో హుడా రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఊపు చూస్తుంటే టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ రాణించకుంటే ఖచ్చితంగా దీపక్ హుడాకే ఛాన్స్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.