Dc Vs GT IPL 2025: ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో ఢిల్లీ జట్టుకు ఎదురేలేదు. ఆ జట్టు వరుస విజయాలతో ఇప్పటికే టేబుల్ టాపర్ గా ఉంది. అయితే ఆ జట్టుకు శనివారం గుజరాత్ జట్టు షాక్ ఇచ్చింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో అత్యద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీ జట్టు విధించిన 204 రన్స్ టార్గెట్ ను గుజరాత్ 19.2 ఓవర్లలో ఫినిష్ చేసింది. కేవలం 3 వికెట్లు మాత్రమే లాస్ అయ్యి టార్గెట్ ను దర్జాగా కొట్టిపడేసింది.. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఇంతవరకు 200 + స్కోర్ టార్గెట్ ను ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా కొట్టలేకపోయింది. కానీ ఆ చరిత్రను ఇప్పుడు గుజరాత్ జట్టు తిరగరాసింది. అంతే ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 203 రన్స్ టార్గెట్ ను ఫినిష్ చేసింది.. గుజరాత్ ఆటగాడు బట్లర్ (97) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. సాయి సుదర్శన్ (36) అంచనాలకు మించి రాణించాడు. కెప్టెన్ గిల్(1) దారుణంగా నిరాశపరిచాడు. అయితే రూథర్ఫోర్డ్ (43) మాత్రం కనికరం లేకుండా కొట్టాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్, కులదీప్ యాదవ్ తలా ఒక వికెట్ సాధించారు.
పాయింట్ల పట్టికలో జాతకాలు మారాయి
గుజరాత్ విజయం సాధించడంతో పాయింట్లు పట్టికలో స్థానాలు మారిపోయాయి. ఇప్పటిదాకా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు రెండో స్థానానికి వచ్చింది. రెండవ స్థానంలో ఉన్న గుజరాత్ మొదటి స్థానానికి చేరుకుంది. ఢిల్లీ జట్టుపై 7 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించడంతో అమాంతం పాయింట్లు పట్టికలో రేసుగుర్రం లాగా దూసుకుపోయింది. గుజరాత్ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడింది. ఇందులో ఐదు విజయాలు సాధించింది. పది పాయింట్లు, +0.984 నెట్ రన్ రేట్ తో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ జట్టు కూడా ఏడు మ్యాచులు ఆడి.. ఐదు విజయాలు సాధించింది. ఈ జట్టు ఖాతాలో పది పాయింట్లు, +0.598 నెట్ రన్ రేట్ ఉంది.. ఫలితంగా ఆ జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఢిల్లీ జట్టు కనుక గుజరాత్ జట్టుపై విజయం సాధిస్తే.. తన మొదటి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేది.. అయితే అనూహ్యంగా గుజరాత్ అద్భుతమైన పోరాట పటిమ చూపించి గెలుపును సొంతం చేసుకుంది. అంతేకాదు పాయింట్లు పట్టికలో స్థానాలను కూడా తారుమారు చేసింది. అయితే గుజరాత్ జట్టు నెంబర్ వన్ స్థానాన్ని తుది వరకు నిలుపుకుంటుందా? ఢిల్లీ జట్టు బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా తన జోరు చూపిస్తుందా? ఈ ప్రశ్నలకు త్వరలో జరిగే మ్యాచ్ లు సమాధానం చెబుతాయని ఐపీఎల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.