David Warner Wife  : దానికోసమే అంపైర్లు తహతహలాడుతున్నారు.. డేవిడ్ వార్నర్ భార్య సంచలన వ్యాఖ్యలు..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు.. భారత్ - ఏ, ఆస్ట్రేలియా - ఏ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య బాల్ టాంపరింగ్ వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం కాస్త చినికి చినికి గాలి వాన లాగా మారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 7, 2024 10:26 pm

David Warner Wife 

Follow us on

David Warner Wife  : ఈ వివాదంపై ఆస్ట్రేలియా మీడియా తనదైన వ్యాఖ్యలు చేస్తుండగా.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండీస్ వార్నర్ స్పందించింది. ” టీమిండియా కు అంపైర్లు తలవంచారు. కారణం తెలియదు కాని భయంతో వెనుకడుగు వేశారు. వారు ఏదో పెద్దదాన్ని(ఐపీఎల్) కోరుకుంటున్నారు. లోతుగా చూస్తే వారి కక్కుర్తి బుద్ధి బయటపడుతోంది. అందువల్లే ఎంతో పెద్దదైన ఈ విషయాన్ని తుస్సుమన్పించారు. మూడో కంటికి తెలియకుండా ముగించేశారని” ఆమె ఆరోపించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కంటే ముందు భారత్ – ఏ జట్టు, ఆస్ట్రేలియా – ఏ జట్టు రెండు అనధికారిక టెస్టులు ఆడుతున్నాయి. ఇందులో భాగంగా తొలి అనధికారిక టెస్టులో నాలుగో రోజు వివాదం చెలరేగింది. భారత ఆటగాళ్లు బాల్ టాంపరింగ్ చేసేందుకు యత్నించారని ఫీల్డ్ ఎంపైర్ క్రెయిగ్ ఆరోపించాడు. ఆ తర్వాత అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. అది కాస్త వివాదానికి దారి తీసింది.. ఈ క్రమంలో టీమిండియా యువ వికెట్ కీపర్ ఈశాన్ కిషన్ తో ఫీల్డ్ ఎంపైర్ మాట్లాడిన మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి.. బంతిని మార్చడాన్ని కిషన్ తప్పుపట్టాడు. అయితే దానిని బాల్ టాంపరింగ్ గా క్రెయిగ్ అర్థం చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్ల ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా బంతి మార్పుకు సంబంధించి భారత ఆటగాళ్లు తమదైన వాణి వినిపించారు. తమకున్న సందేహాల నేపథ్యంలో నిలదీశారు. “ఇక్కడ ఎటువంటి సంభాషణ జరగాల్సిన అవసరం లేదు. చర్చలు చేయకూడదు. ముందుగా మీరు వెళ్లి ఆడండి. ఇదేది డిబేట్ కార్యక్రమం కాదని” ఫీల్డ్ ఎంపైర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలకు ఈశాన్ కిషన్ కు ఒళ్ళు మండిపోయింది..” ఈ బాల్ తో క్రికెట్ ఎలా ఆడమంటారు? దిక్కుమాలిన నిర్ణయానికి ఇది పరాకాష్ట అని” బదిలించాడు.. దానికి క్రెయిగ్ కలగజేసుకున్నాడు.”నువ్వే బంతిని ఏదో చేశావు. అది అలా పాడుకావడానికి కారణం నువ్వే. బంతి ఆకారాన్ని మొత్తం మార్చేలా చేశావు. నీవల్లే బంతిని మార్చాల్సి వచ్చిందని” వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది. అయితే ఈ ఘటన నేపథ్యంలో భారత ఆటగాళ్లపై చర్యలు తధ్యమని అందరూ అనుకున్నారు. ఇదే దశలో క్రికెట్ ఆస్ట్రేలియా భారత జట్టుకు అనుకూలంగా స్పందించింది. “. ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే కచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. బంతి పాడయింది. దానికి ఆటగాళ్లు ఏమీ చేయలేరు. అందువల్లే మేము బంతిని మార్చామని” తన అధికారిక ప్రకటనలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మరోవైపు అంపైర్లు ఏదో ఉద్దేశం తోనే ఈ విషయాన్ని పక్కదారి పట్టించారని.. వారి మనసులో బలమైన కోరిక ఏదో ఉండి ఉంటుందని వార్నర్ సతీమణి క్యాండీస్ వ్యాఖ్యానించారు. “ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగా వారి మనసులో బలమైన కోరిక ఉండి ఉంటుంది. దానిని వారు అంతర్గతంగా బహిర్గతం చేశారు. బహుశా వచ్చే ఐపీఎల్ లో వారికి బహుమానం లభిస్తుందేమో చూడాలి. కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయి. అవి అలా ఎందుకు జరుగుతాయో అస్సలు అర్థం కాదు . ఐపీఎల్ లో అవకాశం కోసమే అంపైర్లు తహతహలాడుతున్నట్టు కనిపిస్తోందని” క్యాండీస్ వ్యాఖ్యానించినట్టు ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది.