David Warner Targets Mahesh Babu: ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు వారికి సుపరిచితుడే. హైదరాబాద్ సన్ రైజర్స్ కు కెప్టెన్ గా సేవలందించిన అతడు తనదైన శైలిలో అందరికి సంతోషం పంచడంలో ముందుంటాడు. అందులో తెలుగు ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని అతడు నవ్వులు పూయిస్తుంటాడు. దీని కోసం టిక్ టాక్ ను వాడుకుని గతంలో ఎన్నో వీడియోలు చేసి అందరిలో ఒకడిగా మిగిలాడు. కొంతకాలం కామ్ గా ఉన్నా మళ్లీ తన స్పూఫ్ వీడియోల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగువారంటే అతడికి భలే ఇష్టం. అందుకే మన ఇక్కడి వారితోనే సరదాలు పంచుకుంటాడు. తనదైన శైలిలో వీడియోలు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉండటం అతడి ప్రత్యేకత.
మన సినిమా స్టార్లను కూడా బేస్ చేసుకుని అతడు వీడియోలు చేస్తుంటాడు. తాజాగా అతడు చేసిన వీడియో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు ఫేస్ ను తన ముఖానికి మార్ఫింగ్ చేసుకుని నేనెవరో చెప్పుకోండి అంటూ ప్రశ్నిస్తున్నాడు. దీంతో మీరు డేవిడ్ వార్నర్ కదా అని ప్రేక్షకులు కూడా సరదాగా సమాధానాలు చెబుతున్నారు. దీంతో అతడికి మానసిక సంతోషం కలుగుతుందని చెబుతున్నాడు. తెలుగు వారికి సంతోషం పంచడమే తన ఉద్దేశమని పేర్కొంటున్నాడు. మహేశ్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో మాస్క్ పెట్టుకుని వీడియో చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
Saakini Dhaakini Collections: ‘శాకిని డాకిని’ 1st డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
సాధారణంగా సెలబ్రిటీలు ఎవరిని పట్టించుకోరు. దేన్ని కూడా లెక్కచేయరు. తమ పనులు చూసుకుంటూ వెళ్లిపోతారు. కానీ వార్నర్ మాత్రం తనకు తెలుగువారంటే అమితమైన ఇష్టమని చెప్పకనే చెబుతున్నాడు. అందుకే మన వారితో నిత్యం టచ్ లో ఉండటం గమనార్హం. దీనికి తెలుగు వారు కూడా సరైన తీరుగానే స్పందిస్తున్నారు. అతడు పెట్టిన వీడియోలకు లైకులు, షేర్లు చేస్తూ అతడి ప్రయత్నాలకు తోడ్పాటు అందిస్తున్నారు. దీంతోనే వార్నర్ మన వారి కోసం ఎన్నో వీడియోలు చేస్తూ మనతో పాలుపంచుకుంటున్నాడనడంలో అతిశయోక్తి లేదు.
Also Read: Godfather Censor Review: సెన్సార్ రివ్యూ : “గాడ్ ఫాదర్” ఎలా ఉందో చెప్పేసిన ప్రముఖ సెన్సార్ బోర్డు మెంబర్ !
డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా కెప్టెన్ రేసులో ఉన్నాడు. ఇటీవల కెప్టెన్ ఆరోన్ పించ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇక వార్నర్ కే ఆ అవకాశం దక్కుతుందని అందరు ఆశిస్తున్ారు. దీనికి తోడు జట్టులోని సీనియర్లు సైతం వార్నర్ కే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో వార్నర్ ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కావడం ఇక లాంఛనమే అని తెలుస్తోంది. అంతటి మహత్తర ఆటగాడిగా ఉన్నా మనవారి కోసం వార్నర్ సమయం కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొందరైతే మనకెందుకులే అనుకుంటారు. కానీ అతడు మాత్రం కొన్నాళ్లు మన జట్టుకు సారధ్యం వహించినందుకు మన సంతోషం కోసం ఇలా చేయడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.