Daniil Medvedev: క్రికెట్లో సచిన్ ఎన్నో రికార్డులలో నెలకొల్పాడు. మరెన్నో సెంచరీలు చేశాడు. ఏనాడు కూడా ప్రత్యర్థి ఆటగాడిని దూషించలేదు. వ్యక్తిగతంగా నిందించలేదు. ఫామ్ కోల్పోయినప్పుడు.. తనలో తాను ఇబ్బంది పడ్డాడు. మళ్లీ తనను తాను పునరావిష్కరించుకున్నాడు. అంతేతప్ప తన నిగ్రహాన్ని కోల్పోయి పరువు తీసుకోలేదు.. క్రికెట్లో వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా, ఇంకా కొంతమంది క్రికెటర్లు క్రమశిక్షణ కోల్పోయి త్వరగానే కెరియర్ కోల్పోయారు. అందువల్లే ఆటగాళ్లకు ఆట తీరుతోపాటు క్రమశిక్షణ కూడా ఉండాలి అంటారు. అది కోల్పోయినాడు వారు పరువుతోపాటు, ఆడే అవకాశం కూడా కోల్పోతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఆగండి ఆగండి అక్కడ దాకే వస్తున్నాం. ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది.
40 లక్షలు ఫట్
ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 (Australian open 2025) జరుగుతోంది. ఈ టోర్నీలో రష్యాకు చెందిన టెన్నిస్ ఆటగాడు డానిల్ మెద్వ దేవ్(Daniil MedveDev) ఆడుతున్నాడు. అయితే అతడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. అయితే అతడికి ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.. ఎందుకంటే ఆ టోర్నీలో డానిల్ మెద్వ దేవ్(Daniil MedveDev) ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. క్రమశిక్షణను ఉల్లంఘించాడు. దీంతో అతని తీరుని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు 40 లక్షల ఫైన్ విధించారు. డానిల్ మెద్వ దేవ్(Daniil MedveDev) ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండులో 418 వ ర్యాంక్ ఆటగాడు కసిడిట్ సామ్రేజ్ పై గెలుపొందాడు. అయితే ఈ గెలుపును తట్టుకోలేక అతడు తన రాకెట్ తో అనేకసార్లు నెట్ కెమెరాను బాదాడు. దీంతో అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. వాస్తవానికి టెన్నిస్లో నెట్ కెమెరాలను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే నెట్ కెమెరాలలో ఆటగాళ్ల కదలికలు నమోదు అవుతాయి. నెట్ కెమెరాలను ధ్వంసం చేయడంతో డానిల్ మెద్వ దేవ్(Daniil MedveDev) పై ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.. అతడు నెట్ కెమెరాలను పలగొట్టిన తీరును తీవ్రంగా పరిగణిస్తూ అపరాధ రసం విధించారు.. పదివేల డాలర్లు అతనిపై ఫైన్ విధించారు. వాస్తవానికి తొలి మ్యాచ్లో నెట్ కెమెరాలు పగలగొట్టిన అతడు.. రెండవ మ్యాచ్ లోనూ అదే తీరుగా వివరించాడు. ముఖ్యంగా రెండో మ్యాచ్లో 19 సంవత్సరాల అమెరికా ఆటగాడు క్వాలిఫై లెర్నర్ టీన్ పై ఓటమిపాలయ్యాడు. 6-3, 7-6, 6-7(10), 7-6(7) తేడాతో దారుణంగా ఓడిపోయాడు. ఓడిపోవడంతో ఒక్కసారిగా అసహనానికి గురై తన రాకెట్ నేలకు కొట్టాడు. బంతిని కూడా వెనుక గోడకు గట్టిగా కొట్టాడు.. తన రాకెట్ బ్యాగ్ ను దూరంగా విసిరేశాడు. కింద పడిన రాకెట్ అందుకొని కేమెరాలను కొట్టాడు. ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు మరోసారి అతనిపై చర్యలు తీసుకున్నారు. ఈసారి ఏకంగా 66వేల డాలర్ల జరిమానా విధించారు. మొత్తం గా 76,000 డాలర్ల ఫైన్ విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది భారత కరెన్సీలో 40 లక్షల వరకు ఉంటుంది.. అయితే 2021, 2022 లో మెల్ బోర్న్ పార్క్ ఫైనల్ లో డానిల్ మెద్వ దేవ్(Daniil MedveDev) భంగపడ్డాడు. అయితే ఈసారి ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని భావించాడు. కానీ అతడి ఆశలు నెరవేరలేదు.