CSK Vs SRH IPL 2025: ఓ మోనాలిసా.. అంతకుముందు కుమారి ఆంటీ.. అలేఖ్య చిట్టి పికిల్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది.. కాకపోతే సోషల్ మీడియా అనేది పాలపొంగు లాంటిది. కింద మంట మండుతున్నంతవరకు పాల పొంగు ఏర్పడుతూనే ఉంటుంది. ఒక్కసారి మంట తగ్గిందా పొంగు కాస్త పడిపోతుంది. ఆ తర్వాత అనుకున్నా ఉపయోగం ఉండదు. అందువల్లే సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడుకోవాలి. దానివల్ల వచ్చిన పేరును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకేసారి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాం కదా అని రెచ్చిపోతే.. ఆ తర్వాత మొదటికే మోసం వస్తుంది. అది జరిగిన తర్వాత ఏమనుకున్నా పెద్దగా ఉపయోగ ఉండదు.
Also Read: ధోని ఉన్నా.. చెన్నై జట్టుకు ఏంటి ఈ దుస్థితి.. సురేష్ రైనా ఏం చెప్పాడంటే..
మరో సెలబ్రిటీ పుట్టుకొచ్చింది
ఐపీఎల్ వల్ల ఇప్పటికే ఇద్దరు సెలబ్రిటీలు పుట్టుకొచ్చారు. ఆ మధ్య చెన్నై జట్టు ఆడుతున్నప్పుడు ధోని అవుట్ కాగానే.. ఓ మహిళ అభిమాని తనదైన మేనరిజం ప్రదర్శించింది. ఆమెను పదేపదే కెమెరామెన్ చూపించడంతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది. దేశవ్యాప్తంగా ఆమె గురించే చర్చ నడిచింది. అంతకుముందు బెంగళూరు ఆడిన ఓ మ్యాచ్లో ఓ మహిళ అభిమాని కూడా ఇలాగే చేసింది. దీంతో ఆమెను కూడా కెమెరామెన్ పదే పదే చూపించడంతో సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. అటు బెంగళూరు, చెన్నై మ్యాచ్లలో సరికొత్తగా కనిపించిన ఆ మహిళలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అయిపోయారు. వారితో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. వారి మీద వాణిజ్య ప్రకటనలు కూడా రూపొందించాయి. ఇక ఇప్పుడు మరో మహిళా అభిమాని కూడా సెలబ్రిటీ అయిపోయింది. శుక్రవారం చిదంబరం స్టేడియంలో హైదరాబాద్, చెన్నై జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత హైదరాబాద్ జట్టు మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. చెన్నై జట్టు ఆటగాళ్లు గొప్ప ఇన్నింగ్స్ ఆడలేక పోవడంతో. ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ఓ మహిళ అభిమాని అయితే తన ఆవేదనను మరో విధంగా వ్యక్తం చేసింది. ఆమెతోపాటు ఓ వ్యక్తి వచ్చాడు. చెన్నై ఆటగాళ్లు వరుసగా విఫలం అవుతుండడంతో ఆమె అతడి భుజం తట్టి.. “అరే ఏంట్రా ఇది.. ఇలా ఆడుతున్నారు.. చూడాలంటనే ఇబ్బందిగా ఉంది.. దీనికోసమా మనం ఎంత దూరం వచ్చింది.. ఇలాంటి ఆట చూసేందుకేనా మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది” అన్నట్టుగా ఆమె తన హావభావాలు ప్రదర్శించింది. ఆమె ముఖ భావాలను ఐపీఎల్ కెమెరామెన్ పదే పదే చూపించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. ఇక నిన్న సాయంత్రం నుంచి ఆమె గురించి సోషల్ మీడియా వేదికలలో నెటిజన్లు తెగ వెతకడం మొదలుపెట్టారు. “ఆమె చూసేందుకు అందంగా ఉంది. ఆమె రూపం కూడా అద్భుతంగా ఉంది. బహుశా ఆమెకు ఎవరైనా సినీ దర్శకులు అవకాశాలు ఇవ్వచ్చు. లేదా కార్పొరేట్ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి జమానా మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ఆమె దశతిరిగిపోయినట్టే. మొత్తానికి హైదరాబాద్ చేతిలో చెన్నై ఓడిపోయినప్పటికీ.. చెన్నై ఓడిపోతుంటే చూడలేని ఆమె బాధ.. అవకాశాలు తెప్పించే విధంగా ఉంది. మొత్తానికైతే ఓ అందమైన అమ్మాయి సెలబ్రిటీ అయిపోయింది.. ఇక కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో ఆమె నామస్మరణ జరుగుతూ ఉంటుంది. రీల్స్, మీమ్స్ కు ఇక లెక్కే ఉండదు.. ఏంటో ఈ సోషల్ మీడియా కాలం.. ఇలా తయారయిపోతోంది.. ఒక వ్యక్తి కాస్త భిన్నంగా కనిపిస్తే చాలు.. వారి చుట్టే ప్రపంచం మొత్తం తిరిగి పోతోంది. ఇది ఎక్కడదాకా వెళ్తుందోనని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.
who is this cutie?#CSKvSRH pic.twitter.com/Hg6zxspP0U
— (@itshitmanera) April 25, 2025