Homeక్రీడలుCSK vs MI : 0.25 సెకండ్లలోనే స్టంప్ అవుట్.. అది దా MSD సర్...

CSK vs MI : 0.25 సెకండ్లలోనే స్టంప్ అవుట్.. అది దా MSD సర్ ప్రైజూ..

CSK vs MI : ఆదివారం నాటి ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లోనూ ధోని సామర్థ్యం మరోసారి కళ్ళ ముందు కనిపించింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai super kings) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పై ఘనవిజయ సాధించింది. చివరి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై జట్టు అద్వితీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు లాస్ అయి 1505 రన్స్ స్కోర్ చేయగలిగింది. సూర్య కుమార్ యాదవ్ 29, తిలక్ వర్మ 31, లాస్ట్ లో దీపక్ చాహర్ 28* పరుగులతో ఆకట్టుకున్నారు.. చెన్నై బౌలర్లు నూర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్, నాదన్ ఎలిస్ చెరో వికెట్ సాధించారు.. వాస్తవానికి తిలక్ వర్మ(Tilak Verma)తో కలిసి ముంబై ఇండియన్స్ జట్టు తాత్కాలిక కెప్టెన్ (Surya Kumar Yadav) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండగా.. ధోని వాయువేగంతో స్టంపింగ్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా చెన్నై వైపు మళ్ళింది. జస్ట్ రెప్పపాటులో ధోని సూర్యకుమార్ యాదవ్ ను అవుట్ చేయడంతో.. ఆ ప్రభావం ముంబై జట్టు స్కోర్ పై చూపించింది. ధోని మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడంతో సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.

Also Read : ఆ మూడు తప్పులే.. ముంబై ఇండియ‌న్స్ కొంప ముంచాయి!

ధోని అంటే అలానే ఉంటుంది

మహీంద్ర సింగ్ ధోని వేగంగా కీపింగ్ చేస్తాడు. వికెట్ల వెనుక గోడ లాగా ఉంటాడు. బంతిని తన రెండు చేతులతో అమాంతం పట్టేసుకుంటాడు. రన్ అవుట్, స్టంపింగ్.. క్యాచ్లు పట్టడంలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తుంటాడు. అందువల్లే ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు ఆటగాళ్లు ఫ్రంట్ ఫుట్ కు వచ్చి ఆడేందుకు సాహసం చేయరు. కాకపోతే ధోని గురించి తక్కువ అంచనా వేసిన సూర్య కుమార్ యాదవ్ దానికి తగ్గట్టుగా మూల్యం చెల్లించుకున్నాడు. కొన్ని సందర్భాల్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఆ నిర్లక్ష్యాన్ని ధోని క్యాష్ చేసుకున్నాడు. కేవలం వికెట్ల వెనుక ఉండటం మాత్రమే కాదు.. బ్యాటర్ల ప్రతి మూమెంట్ ను ధోని గమనిస్తుంటాడు. దానికి తగ్గట్టుగానే బంతులు వేయాలని బౌలర్లకు సూచిస్తుంటాడు. అందువల్లే స్పిన్ బౌలింగ్లో మేటి మేటి ఆటగాళ్లు కూడా ధోని చేతుల్లో చిక్కిన వాళ్లే. తాజాగా సూర్య కుమార్ యాదవ్ ధోని వ్యూహ చతురత ముందు తలవంచాడు. అందువల్లే ధోనిని మాస్టర్ మైండ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తుంటారు. ధోని మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ధోనిని కీర్తిస్తూ చెన్నై అభిమానులు అది దా MSD సర్ ప్రైజూ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Also Read : క్షణం క్షణం ఉత్కంఠ.. సీట్ ఎడ్జ్ మ్యాచ్ అంటే ఇది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular