CSK Captain 2026: ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. గతం అద్భుతం.. నేడు మాత్రం అధ్వానం అన్నట్టుగా చెన్నై జట్టు ఐపీఎల్ లో ఆడుతోంది. 2024, 2025 సీజన్లలో అత్యంత దారుణంగా ఆడింది చెన్నై జట్టు. 2023లో విజేతగా నిలిచిన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. చెన్నై జట్టు లో సమర్థవంతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోతోంది. అందువల్లే తన స్థాయికి తగ్గట్టుగా ఆడ లేక పోతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ ధోని నాయకత్వంలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది.. 2024లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో చెన్నై యాజమాన్యం గైక్వాడ్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇక అప్పటినుంచి చెన్నై జట్టు అంతగా ఆడలేక పోతోంది. పైగా 2025 సీజన్లో గైక్వాడ్ గాయం వల్ల టోర్నీ మధ్య నుంచి వెళ్లిపోయాడు. దీంతో ధోని తాత్కాలిక సారధిగా చెన్నై జట్టును నడిపించాడు. ధోని నాయకత్వంలో కూడా చెన్నై జట్టు అంతగా విజయాలు సాధించలేకపోయింది.. దీంతో జట్టులో సమూల మార్పులు తీసుకురావాలని మేనేజ్మెంట్ భావించింది. ఇందులో భాగంగా కొంతమంది ప్లేయర్లను పక్కన పెట్టాలని.. వారి స్థానంలో ఇతర జట్ల నుంచి ప్లేయర్లను తీసుకోవాలని నిర్ణయించింది.. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజాను రాజస్థాన్ జట్టుకు పంపించింది.. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ ను తీసుకుంది. ట్రేడ్ నిబంధనలలో భాగంగానే చెన్నై జట్టు ఈ విధంగా చేసింది.
చెన్నై జట్టులోకి సంజు రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.. అయితే ఈ సంబరాల వెనుక ఒక బలమైన కారణం ఉంది. చెన్నై జట్టుకు సారధిగా నియమించడానికి సంజు ను తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. చెన్నై అభిమానులు కూడా ఇదే విధమైన వ్యాఖ్యలను చేస్తున్నారు. ధోని నుంచి గైక్వాడ్ కు బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ తర్వాత ధోనికి నాయకత్వాన్ని అప్పగించారు.
ధోని నాయకత్వంలో కూడా చెన్నై జట్టు అంతగా ఆకట్టుకోలేదు. మేనేజ్మెంట్ సంజువైపు ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. అందువల్లే రాజస్థాన్ జట్టుకు రవీంద్ర జడేజా ను పంపించి.. అతడి స్థానంలో సంజు ను తీసుకుంది చెన్నై యాజమాన్యం. రాజస్థాన్ 2024 సీజన్లో సంజు అద్భుతంగా ముందుకు నడిపించాడు. అయితే సెమీఫైనల్ దశలో రాజస్థాన్ ఓటమిపాలైంది. 2025 సీజన్లో రాజస్థాన్ మేనేజ్మెంట్ సరిగ్గా సహకరించకపోవడంతో అతడు కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడాడు. పైగా మేనేజ్మెంట్ తీరు పట్ల అతడు అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్రమంలోనే సంజును జట్టులోకి తీసుకొని మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.