Ravindra Jadeja Pushpa Dialogue: తగ్గేదే లే అంటున్న క్రికెటర్ రవీంద్ర జడేజా

Ravindra Jadeja Pushpa Dialogue: వినూత్న నటనతో ఆకట్టుకునే బన్నీ అంటే అందరికి ఇష్టమే. స్టైలిష్ స్టార్ గా తన స్థానాన్ని ఎప్పుడు నిలబెట్టుకునేందుకు శ్రమిస్తుంటాడు. సినిమా సినిమాకు వైవిధ్యమున్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను హృదయాలను కొల్లగొట్టడం తెలిసిందే. వినోదమే ప్రధానంగా సాగే సినిమాల్లో ఆయన ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేస్తున్నాడు. ప్రతి సినిమాకు ఓ వెరైటీ చూపిస్తూ తనలోని హావభావాలు పండించడంలో ఆయనకు సాటి లేరు. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వారిలో బన్నీ […]

Written By: Srinivas, Updated On : December 24, 2021 12:18 pm
Follow us on

Ravindra Jadeja Pushpa Dialogue: వినూత్న నటనతో ఆకట్టుకునే బన్నీ అంటే అందరికి ఇష్టమే. స్టైలిష్ స్టార్ గా తన స్థానాన్ని ఎప్పుడు నిలబెట్టుకునేందుకు శ్రమిస్తుంటాడు. సినిమా సినిమాకు వైవిధ్యమున్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను హృదయాలను కొల్లగొట్టడం తెలిసిందే. వినోదమే ప్రధానంగా సాగే సినిమాల్లో ఆయన ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేస్తున్నాడు. ప్రతి సినిమాకు ఓ వెరైటీ చూపిస్తూ తనలోని హావభావాలు పండించడంలో ఆయనకు సాటి లేరు. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వారిలో బన్నీ కూడా ఒకరని తెలిసినా ఎక్కడ కూడా ఆయన పేరు వాడుకోకుండా స్వయంకృషితో ఎదుగుతున్న అల్లు అర్జున్ కెరీర్ ఓ సంచలనమే.

Ravindra Jadeja Pushpa Dialogue

మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా పాత్రలు ఎంచుకోవడంలోనే ఆయన వైవిధ్యం చూపిస్తారు. ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తున్న పుష్ప సినిమాలో మాస్ పాత్రలో రాణించి ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు. కలెక్షన్ల పరంగా పుష్ప ఓ రికార్డు సృష్టిస్తోంది. సుకుమార్ సృష్టించిన సుందర కావ్యం పుష్ప అని తెలుస్తోంది. ఆయన తన మార్క్ ను ప్రదర్శించి పుష్పను ఓ రేంజ్ లో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

Also Read: పుష్ప:ది రైజ్​కి అనసూయ పారితోషకం ఎంతో తెలుసా?

సినిమాలో తగ్గేదేలే అనే డైలాగ్ ఇప్పుడు అందరిలో నానుతోంది. ఎవరిని చూసినా ఇదే డైలాగ్ కొడుతూ అనుకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఇదే డైలాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. సెలబ్రిటీలు సైతం ఇదే డైలాగ్ తో అందరిని ఆకర్షిస్తున్నారు. మాసిన గడ్డంతో అల్లు అర్జున్ నటన సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు. దీంతో పుష్ప సినిమా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దూసుకుపోతోంది.

భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా ఇదే డైలాగ్ తో అదరగొడుతున్నారు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కు ఎంపికవని రవీంద్ర జడేజా ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జడేజా ట్విటర్ లో తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ డైలాగ్ ను షేర్ చేశారు. దీంతో అందరిలో సందడి నెలకొంది. ప్రముఖులు కూడా బన్నీ డైలాగ్ ను అనుకరించడంతో అందరు హ్యాపీగా ఫీలవుతున్నారు.

Also Read: బాక్సాఫీస్ : ‘పుష్ప’ 6 రోజుల కలెక్షన్స్ !

Tags