Uttar Pradesh: అవే తరహాలో దారుణాలు.. సంఘటన తీవ్రత మాత్రమే మారుతుంది. జరిగిన ఘటన మాత్రం ఒకే తీరుగా ఉంటున్నది. ఇండోర్ నుంచి మొదలుపెడితే అనంతపురం వరకు అన్ని ఇవే తరహా ఘోరాలు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పటికీ… న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. అయితే మగాళ్లు లేదా ఆడాళ్లు సమిధలుగా మారుతున్నారు.. వివాహేతర సంబంధాల వల్ల సంసారాలు సర్వ నాశనం అవుతున్నాయి. ఇవి దారుణాలకు దారితీస్తున్నాయి. ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయినప్పటికీ.. సమాజంలో మార్పు రావడం లేదు.
హైదరాబాద్ నగరంలో అశోక్ అనే వ్యక్తిని అతని భార్య ఆహారంలో విషం పెట్టి చంపిన ఘటన మర్చిపోకముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భార్య ప్రియుడి మోజులో పడి అత్యంత కిరాతకంగా భర్తను చంపింది. అతడిని ముక్కలు ముక్కలుగా నరికి.. గ్రైండర్ లో రుబ్బింది. ఆ తర్వాత మురికి కాలువలో పడేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శంబల్ జిల్లా చందౌసి ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఈ ప్రాంతానికి చెందిన రాహుల్, రూబీ దంపతులుగా ఉన్నారు. మొదట్లో వీరి సంసారం సజావుగానే సాగింది. రూబీ ఆ తర్వాత దారి తప్పింది. గౌరవ్ అనే యువకుడితో రూబీ వివాహేతర సంబంధం మొదలుపెట్టింది. తన బంధానికి అడ్డుగా ఉండడని భావించి భర్తను అంతం చేయాలని భావించింది. ఇందులో భాగంగా గత నెల 18న రాహుల్ ను రూబీ, గౌరవ్ హత్య చేశారు. తల, చేతులు, కాళ్ళను ముక్కలు ముక్కలుగా నరికారు. గ్రైండర్ లో రుబ్బారు. ఆ తర్వాత మాంసపు ముద్దను డ్రైనేజీలో కలిపారు. అంతేకాదు ఏమీ తెలియనట్టుగా తన భర్త కనిపించడం లేదని రూబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడి చేతి మీద ఉన్న టాటూ ఆధారంగా నిందితులను గుర్తించారు. పోలీసులు వారిద్దరిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
మొదట్లో రూబీ పై పోలీసులకు అంతగా అనుమానం రాలేదు. ఎప్పుడైతే ఆమె వ్యవహార శైలి అనుమానాస్పదంగా అనిపించిందో.. అప్పుడే పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ తర్వాత పోలీసులకు అసలు విషయం తెలిసింది.. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రూబీ వ్యవహార శైలి పట్ల స్థానికులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నప్పుడు కీలక విషయాలను వెల్లడించారు. దీంతో పోలీసులకు అసలు నిజాలు తెలియడంతో రూబీ, ఆమె ప్రియుడు కటకటాల వెనక్కి వెళ్ళక తప్పలేదు.
భర్తను అత్యంత కిరాతకంగా చంపిన మరో భార్య
ప్రియుడితో కలిసి భర్తను ముక్కలు ముక్కలుగా నరికి గ్రైండర్లో రుబ్బి కాలువలో కలిపేసిన వైనం
ఉత్తరప్రదేశ్-శంబల్ జిల్లా చందౌసి ప్రాంతంలో ఘటన
రాహుల్, రూబి భార్యాభర్తలు
గౌరవ్ అనే యువకుడితో రూబికి వివాహేతర సంబంధం
నవంబర్ 18న రాహుల్‌ను హత్య… pic.twitter.com/iSmrb2k9Sm
— BIG TV Breaking News (@bigtvtelugu) December 23, 2025