Wriddhiman Saha: అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళి క్రికెట్ కు కూడా వృద్ధిమాన్ సహా వీడ్కోలు పలికాడు.. ప్రస్తుతం అతడు రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అది తన కెరియర్లో చివరిదని వృత్తి మాన్ సాహా వెల్లడించాడు. వృద్ధిమాన్ సాహా 2010లో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. 2021 వరకు అతడు జట్టులో ఆడాడు.. మహేంద్ర సింగ్ ధోని టెస్టులకు రిటర్మెంట్ ప్రకటించిన అనంతరం.. అతడి స్థానాన్ని వృద్ధిమాన్ సాహా ఆక్రమించాడు. భారత జట్టు మేనేజ్మెంట్ తొలి ప్రాధాన్యత క్రమ వికెట్ కీపర్ గా వృద్ధి మాన్ సహా వ్యవహరించాడు.
రిషబ్ రాకతో..
టెస్ట్ క్రికెట్లోకి రిషబ్ పంత్ రావడంతో వృద్ధి మాన్ సాహా కెరియర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేఎస్ భరత్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో వృద్ధి మాన్ సాహా కు అవకాశాలు లభించకుండా పోయాయి. వృద్ధి మాన్ ప్రస్తుతం 40 సంవత్సరాలు. అతడు భారత జట్టు తరుపున 40 టెస్టులు ఆడాడు. 9 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘమైన ఫార్మాట్లో అతడు 29.41 సగటుతో 1,353 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఆరు హాఫ్ సెంచరీలున్నాయి.. 2021లో ముంబైలోని వాంఖడే మైదానం వేదిక న్యూజిలాండ్ జట్టుతో భారత్ తలపడింది. ఆ మ్యాచ్ లో వృద్ధిమాన్ సాహా ప్రాతినిధ్యం వహించాడు. అదే టీమ్ ఇండియాకు అతడు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించిన మ్యాచ్. క్రికెట్ కు వీడ్కోలు పలికిన అనంతరం వృద్ధిమాన్ సాహ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” నా గొప్ప ప్రయాణంలో ఈ సీజన్ ఆఖరిది. వెస్ట్ బెంగాల్ తరఫున ఆఖరి సారిగా ఆడుతుండడం గౌరవంగా అనిపిస్తోంది. ఈ రంజీ ట్రోఫీ తర్వాత క్రికెట్ ఆడను. ఇక పై ఐపీఎల్ లో కూడా కనిపించనని” వృద్ధిమాన్ సాహా వ్యాఖ్యానించాడు. వృద్ధిమాన్ సాహా 2007 నుంచి 2022 వరకు బెంగాల్ తోపాటు ఇతర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు సంవత్సరాలపాటు త్రిపుర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ ఏడాది ఆగస్టు నెలలో బెంగాల్ రాష్ట్రానికి తిరిగి వచ్చాడు. ఐపీఎల్ కూడా ఆడ బోనాన్ని ప్రకటించిన వృద్ధిమాన్ సాహ.. మెగా వేలంలో కూడా తన పేరును రిజిస్టర్ చేసుకోవడం లేదని తెలుస్తోంది. ఇక ఇటీవల ప్రకటించిన రిటైన్ జాబితాలో గుజరాత్ జట్టు వృద్ధిమాన్ సాహా పేరును ప్రకటించలేదు.. ఐపీఎల్ ప్రారంభం నుంచి వృద్ధిమాన్ సాహా ఆడుతున్నాడు. గుజరాత్ తోపాటు హైదరాబాద్, చెన్నై, పంజాబ్ జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. వయసు పెరగడం, చురుగ్గా ఆడ లేకపోవడం వంటి కారణాలతో వృద్ధిమాన్ సాహా క్రికెట్ కు వీడ్కోలు పలికినట్టు తెలుస్తోంది. అయితే అతడు తదుపరి కోచ్ బాధ్యతను ఎత్తుతాడని ప్రచారం జరుగుతోంది.