https://oktelugu.com/

Gautam Gambhir: బెంగళూరు, పూణే లో అందుకే ఓడిపోయాం.. టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

పుష్కర కాలం దాకా టీమిండియా కు స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి అనేది లేదు. కానీ ఇన్నాళ్లకు న్యూజిలాండ్ చేతిలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. దీంతో టీమ్ ఇండియా ఆటగాళ్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తకోచ్ గౌతమ్ గంభీర్ పై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 1, 2024 / 03:06 PM IST

    Gautam Gambhir

    Follow us on

    Gautam Gambhir: బెంగళూరు, పూణే టెస్టులలో టీమిండియా ఓడిపోవడం పట్ల గౌతమ్ గంభీర్ తొలిసారిగా నోరు విప్పాడు. వరుసగా రెండు టెస్టులలో ఓడిపోవడం వెనుక ఉన్న కారణాలు వెల్లడించాడు..” విపరీతమైన టి20 క్రికెట్ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. వారు అలుపు అనేది లేకుండా క్రికెట్ ఆడుతున్నారు. అది అంతిమంగా ఆటగాళ్లపై ప్రభావం చూపించింది. టెస్ట్ క్రికెట్ లో భారత ఆటగాళ్లు ప్రతిభ చూపించకపోవడానికి ప్రధాన కారణం అదే. ప్రపంచ వ్యాప్తంగా టి20 క్రికెట్ కు విపరీతమైన ఆదరణ పెరిగింది. దీంతో ఆటగాళ్లు కూడా ఒకింత సందేహంలో కూరుకుపోయారు. ఫలితంగా వారు టెస్ట్ క్రికెట్ ఆడలేక పోతున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించడం లేదు. అయితే ఇది మంచి పరిణామం కాదు. త్వరలో భారత ఆటగాళ్లకు వికెట్ కాపాడుకోవడం ఎలాగో అర్థమవుతుంది. ఇకపై ఆటగాళ్లు దూకుడుగా కాకుండా, సంయమనంతో ఆడతారని భావిస్తున్నా. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బ్యాటర్లు దూకుడు తగ్గించుకోవాలి. నిదానంగా ఆడేందుకు ప్రయత్నించాలి. అప్పుడే జట్టుకు విజయావకాశాలు ఉంటాయని” గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.

    బౌలర్లతో ప్రయోగాలు..

    స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో భారతీయ బ్యాటర్లు తేలిపోతున్నారు. ఇటీవల పూణే టెస్టులో అది తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో ముంబై టెస్ట్ ప్రారంభానికి ముందు గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో సుమారు 30+ స్పిన్ బౌలర్లతో బౌలింగ్ చేయించారు.. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారు రోజంతా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.. బంతిని విభిన్న ప్రదేశాలలో వేస్తూ బ్యాటర్లకు కఠినమైన సవాళ్లు విసిరారు. అయితే విరాట్, రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో గౌతమ్ గంభీర్ సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశాడు. ఇక ప్రస్తుతం ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విల్ యంగ్ 71, మిచెల్ 50* టాప్ స్కోరర్లు గా నిలిచారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ముంబై మైదానాన్ని కూడా స్పిన్ వికెట్ కు అనుకూలంగా రూపొందించడంతో.. స్పిన్ బౌలర్లే వికెట్లు పడగొట్టారు. అయితే న్యూజిలాండ్ ఆటగాళ్లు మిచెల్, యంగ్ దూకుడుగా ఆడటంతో న్యూజిలాండ్ మెరుగైన స్కోర్ చేసింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ నిప్పులు చెరిగే విధంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ లోనూ రవిచంద్రన్ అశ్విన్ తేలిపోయాడు. పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు.