T20 Bowling Feat: వేగానికి కొలమానంగా.. దూకుడుకు పర్యాయపదంగా సాగే టి20 ఫార్మాట్ లో ఎన్నో రికార్డులు నమోదు అవుతుంటాయి. మరెన్నో ఘనతలు రికార్డు అవుతుంటాయి. అలాంటిదే ఇది కూడా. పైగా అతడు ఎవరూ సాధించని రికార్డును సొంతం చేసుకున్నాడు. సరికొత్త చరిత్రను సృష్టించాడు. వేగంగా బంతులు వేయడం మాత్రమే కాదు.. వరుస బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా తన పేరు మీద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.
క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న ఐర్లాండ్ జట్టులో కర్టిస్ కంఫెర్ అనే ఆటగాడు దుమ్మురేపాడు. వేగంగా బంతులు వేసి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు.. ఇంటర్ ప్రావెన్షియల్ టి20 ట్రోఫీలో కర్టిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇతడు మాన్స్టర్ రెడ్స్ జట్టు తరుపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా 12 ఓవర్ చివరి రెండు బంతులకు ఇద్దరు ప్లేయర్లను అవుట్ చేశాడు. 14 ఓవర్ అందుకొని.. తొలిముడి బంతుల్లో ముగ్గురు ఆటగాళ్లను అవుట్ చేశాడు. ఇతడు మొత్తం 2.3 ఓవర్లు బౌలింగ్ వేసి.. 16 పరుగులు ఇచ్చాడు. ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ప్రొఫెషనల్ మెన్స్ క్రికెట్లో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీయడం దాదాపు ఇదే తొలిసారి.
Also Read: బాల్ రా మామ, బాగుందిరా మామ..” కోడ్ భాష ఇప్పుడు తెలుగు
ఐర్లాండ్ జట్టులో కర్టిస్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐర్లాండ్ జట్టుకు ఎక్కువగా టోర్నీలు ఉండవు కాబట్టి.. ఎక్కువగా ఇలాంటి లీగ్ లలో ఆ జట్టు ప్లేయర్లు ఆడుతుంటారు. పైగా ఇటీవల కాలంలో ఐర్లాండ్ లో లీగ్ లు నిర్వహిస్తున్నారు . అక్కడి ప్రజలు విపరీతమైన ఆదరణ చూపిస్తున్న నేపథ్యంలో..లీగ్ లు నిర్వహించడానికి ఆయా యాజమాన్యాలు ముందుకు వస్తున్నాయి.
ఐపీఎల్ స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి లీగ్ లు నిర్వహిస్తున్నారు. కాకపోతే ఐపిఎల్ స్థాయిలో ఆదరణ సాధించకపోయినప్పటికీ.. అక్కడ ప్రజలు పర్వాలేదని స్థాయిలోనే ఈ టోర్నీలకు ఆదరణ ఇస్తున్నారు. ఒకప్పటితో పోల్చి చూస్తే ఐర్లాండ్ దేశంలో క్రికెట్ టోర్నీలో ఎక్కువగానే సాగుతున్నాయి. వాటిని చూసేందుకు ప్రేక్షకులు కూడా భారీగానే వస్తున్నారు. కాకపోతే ఈ టోర్నీలు ఇండియా లెవెల్ లో విజయం సాధించాలంటే ఇంకా సమయం పడుతుంది.
Also Read:లార్డ్స్ లో మ్యాచ్ జరుగుతున్న వేళ ఇండియా ఇంగ్లండ్ టెస్ట్ నే ఆపేసిన లేడిబర్డ్స్
” ప్రేక్షకులు భారీగానే వస్తున్నారు. ఊహించిన విధంగా మైదానాలకు తరలివస్తున్నారు. వాస్తవానికి ఫుట్ బాల్ మ్యాచ్ లు ఎక్కువగా చూసే ఇక్కడి ప్రజలు క్రికెట్ వైపు ఇటీవల కాలంలో ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల మ్యాచ్ లు నిర్వహించడం సులభం అవుతుంది. పైగా లాభాలు కూడా వస్తున్నాయి. వచ్చే కాలంలో మరింత ఎక్కువగా నిర్వహిస్తే ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తు కాలంలో ఇక్కడ క్రికెట్ ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉందని” లీగ్ నిర్వాహకులు అంటున్నారు. క్రికెట్ విస్తరిస్తే ఇక్కడ మైదానాలు కూడా నిర్మించడానికి అవకాశం ఏర్పడుతుందని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.
Five balls 5⃣
5⃣ WicketsRemember the Name #Campher pic.twitter.com/2GQQXwHuCE
— Anuragi Ki Kalam Se (@anuvedi) July 11, 2025