SRH Vs RR 2024: సన్ రైజర్స్ అవేంజర్స్ కావాల్సిందేనా? స్ఫూర్తినిస్తున్న వీడియో వైరల్

హైదరాబాద్ జట్టు కప్ గెలవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. గెలిస్తేనే హైదరాబాద్ జట్టుకు కోల్ కతా తో ఫైనల్ లో తలపడేందుకు అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాల్సి ఉంది.

Written By: Bhaskar, Updated On : May 24, 2024 1:56 pm

SRH Vs RR 2024

Follow us on

SRH Vs RR 2024: క్వాలిఫైయర్ -1 మ్యాక్ లో కోల్ కతా చేతిలో ఓడిపోవడంతో.. హైదరాబాద్ జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. గత సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించి పరువు పోగొట్టుకున్న హైదరాబాద్.. ఈసారి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా లీగ్ దశలో రెండవ స్థానంలో నిలిచింది. అయితే కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు.. క్వాలిఫైయర్ -2 మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్థాన్ జట్టుతో తలపడనుంది. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

హైదరాబాద్ జట్టు కప్ గెలవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. గెలిస్తేనే హైదరాబాద్ జట్టుకు కోల్ కతా తో ఫైనల్ లో తలపడేందుకు అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాల్సి ఉంది. గత రెండు మ్యాచ్లలో గోల్డెన్ డక్ ఔట్ అయిన హైదరాబాద్ ఓపెనర్ హెడ్ తన స్థాయికి మించిన ప్రదర్శన చేయాల్సి ఉంది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన ప్రతిభను మరొకసారి నిరూపించుకోవాల్సి ఉంది. నితీశ్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్ వంటి వారు అద్భుతంగా ఆడాల్సి ఉంది.. కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్లో నితీష్ రెడ్డి విఫలమయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో అతడు కచ్చితంగా రాణించాల్సి ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్ గెలిచిన మ్యాచ్లలో పై ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. హైదరాబాద్ భారీగా పరుగులు సాధించేందుకు దోహదపడ్డారు. అహ్మదాబాద్ మైదానం తో పోలిస్తే చెన్నై మైదానం బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. అందువల్ల ఎక్కువగా పరుగులు తీసేందుకు అవకాశం కలుగుతుంది..

ఇక బౌలింగ్ విభాగంలో కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్ తో హైదరాబాద్ జట్టు బలంగా కనిపిస్తోంది. అయితే వీరి ముగ్గురికి ఇతర బౌలర్లు కూడా తోడైతే హైదరాబాద్ జట్టు కు తిరుగుండదు.. అయితే చెన్నై మైదానం స్పిన్నర్లకు సహకరిస్తుంది కాబట్టి.. హైదరాబాద్ జట్టు సమర్థవంతమైన స్పిన్నర్లను తీసుకోవాల్సి ఉంది. శుక్రవారం జరిగే మ్యాచ్లో హైదరాబాద్ జట్టులోకి ఫిలిప్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. రాజస్థాన్ జట్టుకు యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వారు కనుక బంతిని తిప్పితే హైదరాబాద్ ఆటగాళ్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి రావొద్దు అనుకుంటే.. కచ్చితంగా బ్యాట్ కు పని చెప్పాల్సిందే.

హైదరాబాద్ ఐపీఎల్ కప్ పోరులో కీలక మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో అవెంజర్స్ మాదిరి హైదరాబాద్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సత్తా చాటాలని భావిస్తున్నారు. అవెంజర్స్ సినిమాలో పోరాట యోధుల లాగా.. హైదరాబాద్ ఆటగాళ్లు రాజస్థాన్ బౌలర్ లపై విరుచుకుపడాలని.. దూకుడుగా ఆడాలని యోచిస్తున్నారు. మరి హైదరాబాద్ ఆటగాళ్లు ఏం చేస్తారో చూడాల్సి ఉంది..