Homeక్రీడలుక్రికెట్‌Pat Cummins: SRH కు గుడ్ న్యూస్.. అతడి రాకకు లైన్ క్లియర్

Pat Cummins: SRH కు గుడ్ న్యూస్.. అతడి రాకకు లైన్ క్లియర్

Pat Cummins: ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ముఖ్యంగా బౌలింగ్లో సత్తా చూపించింది. ప్రస్తుత ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఒక్కసారిగా ఆ జట్టు ఆట తీరుపట్ల అంచనాలు పెరిగిపోయాయి. అంతగా ఆకట్టుకోలేకపోతున్న బౌలర్లను దూరం పెడుతున్న మేనేజ్మెంట్.. సంచలన ఆట తీరుతో ఆకట్టుకునే బౌలర్లకు అవకాశం కల్పిస్తోంది.

రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన నేపథ్యంలో.. హైదరాబాద్ జట్టుమీద అంచనాలు పెరిగిపోయాయి. తన తదుపరి మ్యాచ్ చెన్నై జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా సాధన చేస్తున్నారు. మరి కొంతమంది కొత్త బౌలర్లను జట్టులోకి ప్రవేశపెట్టాలని.. వారిలో ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ కసరత్తు ఇలా సాగుతుండగానే హైదరాబాద్ జట్టుకు శుభవార్త అందింది.

హైదరాబాద్ జట్టులో ఒకప్పుడు కీలక బౌలర్ గా.. సారధిగా కమిన్స్ ఉండేవాడు. అయితే గాయం వల్ల ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా అతడు ఆడలేదు. అతడి బదులుగా ఇషాన్ కిషన్ తాత్కాలిక సారధిగా వ్యవహరిస్తున్నాడు. కిషన్ నాయకత్వంలో ఐదు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్.. రెండిట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో గాయంతో ఇబ్బంది పడుతున్న కమిన్స్ త్వరలోనే జట్టులో చేరుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. అతని రాకకు సంబంధించి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ నుంచి సమ్మతి లభించిందని.. త్వరలోనే అతడు జట్టుతో ప్రయాణాన్ని మొదలుపెడతాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే గనక నిజమైతే.. హైదరాబాద్ జట్టు బౌలింగ్ బలం మరింత పెరుగుతుంది..

ప్రస్తుతం యువకులు సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇద్దరు పేస్ బౌలర్లు చెరి నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నారు. వారికి కమిన్స్ అనుభవం తోడైతే హైదరాబాద్ జట్టుకు అడ్డు ఉండదు. తదుపరి మ్యాచ్లో కూడా ఇదే జోరు కొనసాగించాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ జట్టుకు అన్ని మంచి శకనుమలే కనిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో హైదరాబాద్ టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. 2024లో ఫైనల్ వెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈసారైనా ఫైనల్ వెళ్లి ట్రోఫీ అందుకోవాలని హైదరాబాద్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular