Rinku Singh House: రిటైన్ లో భారీ ధరకు అమ్ముడుపోవడంతో రింకూ సింగ్ దశ ఒక్కసారిగా మారిపోయింది.. గతంలో ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులతో పేద పిల్లలకు రింకూ సింగ్ హాస్టల్ కట్టించాడు. అందులో అన్ని వస్తువులు ఉండేలా ఏర్పాటు చేశాడు. అయితే వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ కు భారీ ధరకు అమ్ముడుపోవడంతో రింకూ సింగ్ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. అతడు ఒక అద్భుతమైన ఇల్లును కొనుగోలు చేశాడు. అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీ గడ్ ప్రాంతంలో ఉంది. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ ఇల్లు ఉంది. ఆ ఇల్లు చూడడానికి ఇంద్ర భవనాన్ని తలపిస్తోంది. ఆ ఇంట్లో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. అనితర సాధ్యమైన సదుపాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రింకూ సింగ్ యూ ట్యూబర్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఆ దృశ్యాలను పొందుపరిచాడు. ఇంతకీ రింకూ సింగ్ కొనుగోలు చేసిన కొత్త ఇంట్లో ఎలాంటి విశేషాలు ఉన్నాయంటే..
3.5 కోట్లతో కొనుగోలు..
రింకూ సింగ్ తన ఇంటిని 3.5 కోట్లతో కొనుగోలు చేశాడు. ఇది అలీగడ్ ప్రాంతంలోని గోల్డెన్ ఎస్టేట్లో ఉంది. ఇందులో ఆరు పడక గదులు ఉన్నాయి. సేద తీరడానికి స్విమ్మింగ్ పూల్ ఉంది. విశాలమైన హాల్ ఉంది. డైనింగ్ టేబుల్ కూడా అద్భుతంగా ఉంది. స్నేహితులు, బంధువులతో సరదాగా విందులు చేసుకోవడానికి బార్ కూడా ఉంది. ఇలా సకల వసతులు తన ఇంట్లో ఉండేలాగా రింకూ సింగ్ చేసుకున్నాడు. గోల్డెన్ ఎస్టేట్ ప్రతినిధులు నవంబర్ ఐదు న ఈ ఇంటికి సంబంధించిన తాళాలను రింకూ సింగ్ కు అందించారు. ఈ ఇంట్లో ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ జట్టుపై ఐదు బంతుల్లో వరుసగా సిక్సులు కొట్టిన బ్యాట్ ను జాగ్రత్తగా దాచుకున్నాడు. అ పక్కన తన క్రికెట్ కెరియర్ లో మధురమైన జ్ఞాపకాలను, ఇతర సంఘటనలకు సంబంధించిన ఫోటోలను, షారుక్ ఖాన్ తో దిగిన చిత్రాలను ఏర్పాటు చేశాడు. ఇక ఇంటీరియర్ కూడా అద్భుతంగా సమకూర్చుకున్నాడు. ఇంటి విషయంలో అద్భుతమైన అభిరుచిని రింకూ సింగ్ ప్రదర్శించాడు.. ఇక రింకూ సింగ్ క్రికెట్ ఆడటం అతని తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే అందులోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తన తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదిగాడు. రింకూ సింగ్ పేరు పొందిన క్రికెటర్ అయినప్పటికీ.. ఇప్పటికీ అతని తండ్రి ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్లో వేస్తూ ఉంటాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కు సంబంధించి కోల్ కతా జట్టు అతనిని 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. భారీగా సొమ్ము వస్తున్న నేపథ్యంలో రింకూ సింగ్ అధునాతనమైన ఇంటిని కొనుగోలు చేశాడు. తన కలల సౌధాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకున్నాడు.