https://oktelugu.com/

Hardik Pandya: హార్ధిక్ పాండ్యాపై తిరుగుబాటు.. ముంబై ఇండియన్స్ లో చిచ్చు.. అసలేం జరిగిందంటే.?

ఈ సంవత్సరం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ టీమ్ ఏమాత్రం తమ ప్రతిభను చూపించలేక పోవడంతో పాటుగా పేలవమైన పర్ఫామెన్స్ ను ఇస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 9, 2024 / 04:33 PM IST

    Revolt against Hardik Pandya

    Follow us on

    Hardik Pandya: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ముంబై ఇండియన్స్ టీం ఈ సీజన్ లో దారుణంగా ఫెయిల్ అయింది. ఆడిన 12 మ్యాచ్ ల్లో 4 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించి ఈ సీజన్ నుంచి అఫీషియల్ గా ఎలిమినేట్ అయిన మొదటి టీం గా ముంబై ఇండియన్స్ టీం నిలవడం అనేది ఆ జట్టు పరువు, ప్రతిష్ట లకు సంబంధించిన మ్యాటర్ అనే చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ టీం అంటే ఒకప్పుడు టాప్ పొజిషన్ లో ఉండేది. కానీ ఈ సంవత్సరం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ టీమ్ ఏమాత్రం తమ ప్రతిభను చూపించలేక పోవడంతో పాటుగా పేలవమైన పర్ఫామెన్స్ ను ఇస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ టీం డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్లు మధ్య ఏకాభిప్రాయం ఉండటం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. సీనియర్ ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ లో హార్దిక్ పాండ్యా విధానాన్ని తప్పుబడుతూ తమ కోచింగ్ సిబ్బందికి తెలియజేశారట. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్ చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం అయితే కనిపించడం లేదు. “ఎవరికి వారే యమునా తీరే” అన్నట్టుగా ముంబై ప్లేయర్ల పరిస్థితి తయారైంది. ఇక హార్థిక్ పాండ్యా కూడా టీమ్ ని ముందుండి నడిపించడం లో ఫెయిల్ అవ్వడమే కాకుండా, ప్లేయర్లందరిలో ఒక సమిష్టి దృక్పథాన్ని తీసుకురావడం లో కూడా ఆయన విఫలం అయ్యాడు. ఇక రీసెంట్ గా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఓడిపోవడానికి తిలక్ వర్మనే కారణం అంటూ హార్దిక్ పాండ్య చేసిన కామెంట్లు సంచలనాన్ని సృష్టించాయి.

    ఇక వీటి వాళ్ల పాండ్య చాలా విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. నిజానికి తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో 32 బంతుల్లో 63 పరుగులు చేశాడు… అయితే హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ ఓడిపోవడానికి తిలక్ వర్మ నే కారణమని చెప్పడంతో తిలక్ కొద్దిగా నిరుత్సాహపడినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే హార్దిక్ పాండ్యాతో తను ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది…

    ఇక ముంబై ఇండియన్స్ టీం లోని సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, జాస్ప్రిత్ బుమ్రా లాంటి ప్లేయర్లు తమ కోచింగ్ సిబ్బందితో భోజనాలు చేస్తున్న సమయంలో టీం లో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి వివరించారట. దాంతో కోచింగ్ సిబ్బంది కూడా ఒక్కొక్కరితో మాట్లాడి టీంలో అసలు ఏం జరుగుతుంది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. టీమ్ లో ప్లేయర్ల మధ్య స్నేహపూరితమైన వాతావరణం లేకపోవడం అనేది ఆ టీమ్ కి భారీ దెబ్బగా మారింది. ఇక ముంబై టీమ్ కోచింగ్ సిబ్బంది లోని అధికారి ఒకరు మాట్లాడుతూ పదేళ్లు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై టీమ్ చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్లింది.ఇక ఇప్పుడు కొత్త కెప్టెన్సీ లో ప్లేయర్లందరూ సరిగ్గా ఆడాలి అంటే కొంత సమయం అయితే పడుతుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ లో అదే జరుగుతుంది అంటూ తను వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు…

    ఇక ఇదిలా ఉంటే ఆస్ట్రేలియన్ టీమ్ మాజీ ప్లేయర్ అయిన ‘మైకేల్ క్లార్క్’ మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ టీం లో ప్లేయర్ల మధ్య కోఆర్డినేషన్ అయితే మిస్ అయింది. ఎవరెవరు ఎందుకు మ్యాచ్ ఆడుతున్నారో కూడా వారికి క్లారిటీ లేదు.ప్లేయర్లందరిలో ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. ముఖ్యంగా వాళ్ళందరిలో అండర్ స్టాండింగ్ మిస్ అయింది. కాబట్టి ముంబై ఇండియన్స్ టీం ఫెయిల్ అయింది అంటూ తను కామెంట్స్ అయితే చేశాడు..