India Vs Australia 2nd Test: క్యూరేటర్ చెప్పినట్టుగానే ఈ మైదానం పేస్ బౌలర్లకు సహకరించింది. ఆస్ట్రేలియా చెందిన ముగ్గురు బౌలర్లు టీమిండియా వికెట్లు మొత్తం పడగొట్టారు. అయితే వీరంతా పేస్ బౌలర్లు కావడం విశేషం. ఈ మైదానంపై స్టార్క్ రెచ్చిపోయాడు. మైదానంపై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ పదునైన బంతులు వేశాడు. టీమిండి ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులు వేస్తూ పరుగులు చేయకుండా కట్టడి చేశాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సతీష్ కుమార్ రెడ్డి, అశ్విన్, రాణా వంటి ఆటగాళ్లను అవుట్ చేశాడంటే స్టార్క్ బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏమాత్రం భయపడకుండా.. కాస్త కూడా వెనుకడగు వేయకుండా నితీష్ కుమార్ రెడ్డి ఆడాడు కాబట్టే టీమిండియా ఆ స్థాయి స్కోర్ చేయగలిగింది. లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అయితే అతడిని కూడా స్టార్ట్ చేయడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది.
అరుదైన రికార్డు
అడిలైడ్ మైదానంపై తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సాధించడం ద్వారా స్టార్క్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2024 లో అడిలైడ్ వేదికగా భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో స్టార్క్ 48 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు సాధించాడు. 2016లో గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 50 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. 2019లో అడిలైడ్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో స్టార్క్ 66 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. 2015 లో నాటింగ్ హమ్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 111 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ఇక 2012లో పెర్త్ వేదికగా సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో 154 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు సాధించాడు. అడిలైడ్ వేదికగా ఆరు వికెట్లు పడగొట్టడంతో.. తొలిసారి భారత జట్టుపై ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు స్టార్క్. ఇప్పటివరకు డే అండ్ నైట్ టెస్టులలో నాలుగుసార్లు ఐదు వికెట్ల ఘనతను స్టార్క్ సొంతం చేసుకున్నాడు. మరే ఇతర బౌలర్ స్టార్క్ కు దగ్గర్లో లేరు. ఇతర బౌలర్లు రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఈ ఘనతను సాధించారు. గతంలో ఈ వేదికపై స్టార్క్ మెరుగైన ప్రదర్శన చేశాడు. అద్భుతంగా వికెట్లను రాబట్టాడు . ఆ అనుభవం వల్ల టీమ్ ఇండియాను త్వరగానే ఆల్ అవుట్ అయ్యేలా చేశాడు. ఏకంగా ఆరుగురు బ్యాటర్లను అవుట్ చేసి తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించాడు.