క్రీడలుక్రికెట్‌MI vs RCB : హిట్ మ్యాన్ నే చెడుగుడు ఆడేశావు.. నువ్వు తోపు సామీ

MI vs RCB : హిట్ మ్యాన్ నే చెడుగుడు ఆడేశావు.. నువ్వు తోపు సామీ

MI vs RCB : బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ (67), కెప్టెన్ రజత్ పాటిదార్(64) టాప్ స్కోరర్ లు గా నిలిచారు. చివర్లో జితేష్ శర్మ (40) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై జట్టులో బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరి రెండు వికెట్లు దక్కించుకున్నారు. విగ్నేష్ ఒక వికెట్ సాధించాడు. ఇక అనంతరం 223 పరుగుల టార్గెట్ తో చేజింగ్ మొదలుపెట్టిన ముంబై జట్టుకు గొప్ప ఆరంభం లభించలేదు.. ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి వచ్చిన రోహిత్ శర్మ (17) అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టిన అతడు.. యష్ దయాళ్ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్.. వికెట్ సమర్పించుకున్నాడు.. దీంతో నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టడంతో రోహిత్ ఫామ్ లోకి వచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ అదంతా ఆరంభ శూరత్వమని నిరూపించడానికి రోహిత్ ఎంతో సమయం తీసుకోలేదు. ఇక ఐపీఎల్ సీజన్లో రోహిత్ విఫల ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన మ్యాచ్ కు దూరంగా ఉన్న అతడు… బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. 9 బంతుల్లో 17 పరుగులు చేసినప్పటికీ.. దానిని బలమైన ఇన్నింగ్స్ లాగా మార్చలేకపోయాడు.

నాలుగు మ్యాచ్లలో 38 పరుగులు

ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన రోహిత్.. ఒకదాంట్లో కూడా తనదైన మార్క్ చూపించలేదు. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో 0 పరుగు లకు అవుట్ అయిన రోహిత్.. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8…కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్లో 13 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్లలో 38 పరుగులు చేసి.. అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు రోహిత్. మరోవైపు ఇదే మ్యాచ్లో రోహిత్ సమకాలికుడు విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టు తరఫున 67 పరుగులు చేశాడు. అంతేకాదు ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రోహిత్ 17 పరుగులకే అవుట్ కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ” రోహిత్ మీద ముంబై జట్టు ఎన్నో ఆశలు పెంచుకుంది. కానీ వాటిని రోహిత్ అడియాసలు చేస్తున్నాడు. బ్యాటింగ్ ఏమాత్రం గొప్పగా చేయడం లేదు. దారుణంగా అవుట్ అవుతున్నాడు. అసలు రోహిత్ శర్మ ఇలా ఎందుకు ఆడుతున్నాడో అర్థం కావడం లేదని” ముంబై ఇండియన్స్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Vaibhav Suryavanshi: టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.. సీట్ల సంఖ్యను పెంచారు.. మన సూర్య వంశీ రేంజ్ అలా ఉంటది మరి

Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో 15 సంవత్సరాల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీ ఎంతటి సంచలనాలను సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హేమా హేమీలైన ప్లేయర్లు ఆడినప్పటికీ సూర్య వంశీ...

Nitish Kumar Reddy: సొంత ఊర్లో నితీష్ కుమార్ రెడ్డి.. నానమ్మకు ఊహించని గిఫ్ట్.. ఫిదా చేశాడు పో..

Nitish Kumar Reddy: ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మూలాలు మర్చిపోకూడదు అని మన పెద్దలు అంటారు. దానిని నిజం చేసి చూపించాడు టీమిండియా యంగ్ ప్లేయర్.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version