https://oktelugu.com/

Kuldeep Yadav: బాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి… క్లారిటీ ఇచ్చిన క్రికెటర్ కుల్దీప్ యాదవ్… పెళ్లి ఎప్పుడంటే…

Kuldeep Yadav: ప్రస్తుతం ఇదే క్రమంలో క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఒక బాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం టీం ఇండియా లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో కుల్దీప్ యాదవ్ కూడా ఒకరు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 9, 2024 / 04:37 PM IST

    Kuldeep Yadav to marry a Bollywood actress

    Follow us on

    Kuldeep Yadav: సోషల్ మీడియా లో ఎప్పుడు కూడా క్రికెటర్ల లవ్ స్టోరిల గురించి వారి పెళ్లి గురించి చాల వార్తలు వైరల్ అవుతుంటాయి.క్రికెటర్లు సినిమా హీరోయిన్లను,సెలెబ్రెటీలను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కొత్తేమి కాదు.ఒక క్రికెటర్ ఫలానా బాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్నాడు అని రూమర్ వస్తే చాలు ఆ రూమర్స్ రోజు రోజుకు పెరుగుతాయి తప్ప తగ్గవు.

    ప్రస్తుతం ఇదే క్రమంలో క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఒక బాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం టీం ఇండియా లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో కుల్దీప్ యాదవ్ కూడా ఒకరు.ఆయన త్వరలో ఒక బాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.తాజాగా ఈ విషయం గురించి ఓపెన్ అయినా కుల్దీప్ యాదవ్ ఏం చెప్పాడంటే…

    తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కుల్దీప్ యాదవ్ తానూ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని…కానీ తనకు కాబోయే భార్య బాలీవుడ్ హీరోయిన్ కాదని క్లారిటీ ఇచ్చాడు.టీ 20 2024 ప్రపంచ కప్ ను భారత్ గెలిచినా తర్వాత అందరి దృష్టి ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ పెళ్లి మీద ఉంది.దాంతో కుల్దీప్ తాజాగా NDTV కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకు కాబోయే భార్య బాలీవుడ్ హీరోయిన్ కాదని తెలిపాడు.తనను,తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు.

    అయితే పెళ్లి కూతురు ఎవరో అధికారికంగా త్వరలో చెప్పే అవకాశం ఉంది.టీ 20 2024 వెస్టిండీస్ లో జరిగిన ప్రపంచ కప్ లో కుల్దీప్ యాదవ్ తన సత్తాను చూపించాడు.అయితే లీగ్ స్టార్టింగ్ లో పేస్ ఫ్రెండ్లీ న్యూయార్క్ పిచ్ ల కారణంగా కుల్దీప్ ను ఆడించలేదు.ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో చోటు సంపాదించుకున్న కుల్దీప్ కేవలం అయిదు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి సక్సెస్ అయ్యాడు.టీం ఇండియా విజయం లో కుల్దీప్ యాదవ్ కూడా ముఖ్యపాత్రను పోషించాడు.