Homeక్రీడలుక్రికెట్‌IPL Impact Player Rule 2026: ఈసారి ఇంపాక్ట్ సబ్ నిబంధన ఉంటుందా.. ఇదిగో క్లారిటీ..

IPL Impact Player Rule 2026: ఈసారి ఇంపాక్ట్ సబ్ నిబంధన ఉంటుందా.. ఇదిగో క్లారిటీ..

IPL Impact Player Rule 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంపాక్ట్ సబ్ అనే నిబంధన ప్రతిసారి చర్చకు కారణం అవుతూ ఉంటుంది. ఈ నిబంధన ఉండాలని కొన్ని జట్లు.. ఉండకూడదని కొన్ని జట్లు బలంగా వాదించాయి. ఈ నిబంధన ఉంటుందా? ఉండదా? అనే ప్రశ్నలు ప్రతి సీజన్లోను వ్యక్తమవుతూనే ఉంటాయి. అయితే ఈసారి ఈ నిబంధన పై మరోసారి చర్చ మొదలైంది..

Also Read: ఇజ్రాయెల్‌లో వేలాది కాకులకు ఏమైంది.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయి? వినాశనమేనా?

ఇన్ఫాక్ట్ సబ్ నిబంధన పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం బిసిసిఐ కార్యాలయంలో పది జట్ల కెప్టెన్లతో సమావేశమైంది. ఈ క్రమంలో అనేక అంశాలపై చర్చ నడిచినట్టు తెలుస్తోంది. కొంతమంది కెప్టెన్లు తమ సందేహాలను వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ సబ్ విధానంపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఈ నిబంధనను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రవేశపెట్టింది.

2027 వరకు కొనసాగిస్తామని ప్రకటించింది. వాస్తవానికి ఈ నిబంధనను కొనసాగిస్తామని 2024 లోనే బీసీసీఐ నిర్ణయించింది.. అనేక జట్ల కెప్టెన్లు ఈ నిబంధన పై సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ.. గవర్నింగ్ కౌన్సిల్ 2027 వరకు కొనసాగిస్తామని చెప్పడం విశేషం.. గత ఏడాది కెప్టెన్ల కు గవర్నింగ్ కౌన్సిల్ వెసలు బాటు ఇచ్చింది. రెండవ ఇన్నింగ్స్ సమయంలో మంచు కురుస్తుంటే.. దాన్ని దృష్టిలో పెట్టుకొని 10 ఓవర్ల తర్వాత కొత్త బంతిని తీసుకునే అవకాశాన్ని కెప్టెన్లకు కల్పించింది. ఈసారి కూడా అదే నిబంధన కొనసాగుతుందని తెలుస్తోంది..

ఇంపాక్ట్ సబ్ విషయంలో అనేక జట్లకు సంబంధించిన కెప్టెన్లు తమ సందేహాలను వ్యక్తం చేశారు. వీటిని నివృత్తి చేసిన మేనేజ్మెంట్.. ఈ నిబంధన విషయంలో ఎటువంటి మార్పు ఉండదని ప్రకటించింది. ఎందుకంటే ఈ నిబంధన గనక తొలగిస్తే ఆటలో ఉన్న మజా మొత్తం పోతుందని మేనేజ్మెంట్ ప్రకటించింది.”అభిమానులు మూస విధానంలో క్రికెట్ చూడాలి అనుకోవడం లేదు. వారికంటూ కాస్త ఆనందం కావాలి. ఉత్సాహం కావాలి. ఉద్వేగం కావాలి. ఇవన్నీ జరగాలంటే ఇంఫాక్ట్ నిబంధన కొనసాగుతూనే ఉండాలి. అప్పుడే క్రికెట్లో మజా వస్తుంది. ఎందుకంటే ఇది పరిమిత ఓవర్ల పాటు మాత్రమే సాగుతుంది. కాబట్టి ఆ స్థాయిలో ఆనందాన్ని ఇవ్వకపోతే ఎలా.. ప్రేక్షకులు డబ్బు చెల్లించి మ్యాచ్ లు చూసేందుకు వస్తారు. అలాంటప్పుడు వారికి పూర్తిస్థాయిలో వినోదం అందించాల్సిన మన మీద ఉందని” ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇన్ని రోజులపాటు జరిగిన చర్చకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ క్లారిటీ ఇవ్వడంతో.. ఇకపై దీని గురించి ఈ సీజన్లో ఎటువంటి సందేహాలు వ్యక్తమయ్యే అవకాశం లేదు .

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version