India Vs Australia: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సెయింట్ లూయిస్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో భారత్ 24 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సందర్భంగా అనేక రికార్డులు గల్లంతయ్యాయి.
ఈ మ్యాచ్లో అటు భారత ఆటగాళ్లు 16 సిక్సర్లు బాదారు. ఆసీస్ ఆటగాళ్లు 8 సిక్సర్లు కొట్టారు. సిక్సర్లపరంగా ఈ మ్యాచ్ మూడో స్థానంలో ఉంది.
2014 లో సిల్హెట్ వేదికగా నిర్వహించిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఐర్లాండ్ – నెదర్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 30 సిక్సర్లు నమోదయ్యాయి. ఇదే హైయెస్ట్ సిక్సర్ల మ్యాచ్ గా మొదటి స్థానంలో ఉంది.
2010లో బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఆస్ట్రేలియా – భారత్ తలపడగా.. ఈ మ్యాచ్ లో 24 సిక్సర్లు నమోదయ్యాయి. సిక్సర్ల సంఖ్య పరంగా ఇది రెండవ అతిపెద్ద మ్యాచ్.
గ్రాస్ హైలెట్ వేదికగా 2010లో ఆస్ట్రేలియా – పాకిస్తాన్ పరస్పరం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 22 సిక్సర్లు నమోదయ్యాయి.
2016లో సౌత్ ఆఫ్రికా – ఇంగ్లాండ్ జట్లు తలపడగా.. 22 సిక్సర్లు నమోదయ్యాయి. సిక్సర్లపరంగా ఇది ఐదవ అతిపెద్ద మ్యాచ్ గా రికార్డు సృష్టించింది.