Ind Vs Aus 5th Test: బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతోంది. ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడగా, ఆస్ట్రేలియా 2–1తో ఆధిక్యంతో ఉంది. ఇక ఆఖరి మ్యాచ్ సిడ్నీలోని ఎంసీజీ మైదానంలో జనవరి 3న ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ కూడా.. బౌలింగ్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడానికి బ్బంది పడ్డారు. దీంతో భారత బలర్లు.. వరుసగా వికెట్లు పడగొడుతూ 180 పరుగులకే కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ రెండో ఇన్నింగ్ ఆడుతోంది. మూడో రోజు లేదా. నాలుగో రోజు టెస్టు పూర్తవనుంది.
200పైగా లక్ష్యం నిర్దేశిస్తే..
తాజాగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి. 141 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో యశశ్వి కుదురుకున్నట్లు కనిపించనా 22 పరుగులకే ఔట్ అయ్యాడు. కేఎల్.రాహుల్, కోహ్లీ, శుభ్‌మన్‌గిల్ విఫలమయ్యారు. పంత్ ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. 29 బంతులోకే ఆఫ్ సెంచరీ చేశాడు. ధాటిగా ఆడే క్రమంలో 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నితిశ్‌కుమార్‌రెడ్డి రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపర్చాడు. కేవలం 4 పరుగులకే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రవీంద్రజడేజా, వాషింగ్‌టన్ సుందర్ క్రీజ్‌లో ఉన్నారు. భారత్ 141 పరుగులకు ఆరు వికెట్లు కల్పోయింది. మరో 60 పరుగులకుపైగా చేస్తే ఆసిస్‌ను ఇబ్బందిపెట్టడం ఖాయం.
బౌలింగ్‌కు అనుకూలంగా..
బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న సిడ్నీ పిచ్‌పై మన బౌలర్లు రెచ్చిపోతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసిస్‌ను 180కే కట్టడి చేశారు. ఇందులో బూమ్రా 2, సిరాజ్, ప్రసి«ద్ కృష్ణ తలో మూడు వికెట్లు పడగొట్టారు. నితీశ్‌కుమార్‌రెడ్డి 2 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియాను ఓడించే అవకాశం ఉంది. ఇందుకు భారత్ కనీసం 200 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ ముందు ఉంచాలని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ప్రస్తుతం 141/6 పరుగుల వద్ద రెండో రోజు ఆట ముగిసింది. ఇంకా భారత్ చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. జడేజా, వాషింగ్‌టన్ సుందర్ మూడో రోజు మొదటి సెషనల్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడితే 200 పరుగుల లక్ష్యం విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్ 146 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 60 పరుగులు జోడిస్తే మంచి టార్గెట్ అవుతుంది. భారత బౌలర్లు మరోసారి చెలరేగితే టీమిండియా గెలవడంతోపాటు సిరీస్ సమం అవుతుంది. వరల్డ్ టెస్ట్ సిరీస్‌కు భారత్ అవకాశాలు మెరుగువతాయి. ఈనేపథ్యంలో మూడోరోజు జడేజా, వాషింగటన్ సుందర్ ఆటతీరుపైనే భారత విజాయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.