India Vs Australia 2nd Test: ఊహించినట్టుగానే అడిలైడ్ మైదానం పేస్ బౌలింగ్ కు స్వర్గధామం లాగా మారింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడం అతిపెద్ద తప్పిదమైంది. ఖాతా తెరవకుండానే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. పెర్త్ టెస్టు ఇన్నింగ్స్ లో 161 రన్స్ చేసిన యశస్వి జైస్వాల్ ఈసారి 0 పరుగులకే అవుట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (37), గిల్(31) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 7, రోహిత్ శర్మ 3 దారుణంగా విఫలమయ్యారు. ఈ దశలో రిషబ్ పంత్ 21 ఆకట్టుకున్నాడు. అశ్విన్ 22 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఈసారి కూడా ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. 42 పరుగులతో రాణించాడు. ఫలితంగా టీమిండియా 180 పరుగులకు కుప్పకూలింది. టీమిండియాలో జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా 0 పరుగులకే అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు పడగొట్టాడు. బోలాండ్, కమిన్స్ చెరో రెండు వికెట్లు సాధించారు.
పేస్ బౌలర్లు అదరగొట్టారు
ఈ మైదానంపై ఊహించిన విధంగానే పేస్ బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్క్ అద్భుతమైన బంతులు వేస్తూ టీమ్ ఇండియా బ్యాటర్లను వణికించాడు. మైదానంపై తేమ వుండడం తో అద్భుతమైన పేస్ రాబట్టాడు. పెర్త్ టెస్టులో హేజిల్ వుడ్ మాదిరిగానే.. అడిలైడ్ టెస్టులో స్టార్క్ బౌలింగ్ వేసాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులు వేసి ఇబ్బంది పెట్టాడు. ఆఫ్ స్టంప్ వైపు బంతులు వేసి టీమిండియా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. గతంలో ఈ మైదానంపై డే అండ్ నైట్ మ్యాచ్ జరిగినప్పుడు టీమిండియా రెండవ 36 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈసారి టీమిండియా ఆటగాళ్లు నిదానంగా ఆడారు. భారీ స్కోరు చేయకపోయినప్పటికీ.. ఉన్నంతలో మెరుగ్గానే బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయినప్పటికీ.. స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఆడిన ఇన్నింగ్స్ భారత జట్టుకు కీలకంగా నిలిచింది. హాఫ్ సెంచరీ చేయలేకపోయినప్పటికీ నితీష్ కుమార్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కఠినమైన పరిస్థితుల్లోనూ నితీష్ కుమార్ రెడ్డి గట్టిగా నిలబడ్డాడని.. టీమిండియా మెరుగైన స్కోర్ సాధించేలా కృషి చేశాడని అభిమానులు సామాజిక మాధ్యమాలలో కొనియాడుతున్నారు. హాఫ్ సెంచరీ చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 180 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 42, రాహుల్ 37, గిల్ 31, అశ్విన్ 22, పంత్ 21 రన్స్ చేశారు. స్టార్క్ ఆరు, బోలాండ్, కమిన్స్ చెరో రెండు వికెట్లు సాధించారు.#AUSvsIND#PinkBallTest pic.twitter.com/4dgakdyPHg
— Anabothula Bhaskar (@AnabothulaB) December 6, 2024