https://oktelugu.com/

Zimbabwe vs India : నువ్వేం మనిషివి రా బాబూ.. స్వార్థానికి మారు పేరులా నిలిచావ్.. టీమిండియా కెప్టెన్ ను ఏకి పడేస్తున్న నెటిజన్లు.. కారణం ఇదే..

నాలుగో టి20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గిల్ టాస్ గెలిచాడు. జింబాబ్వే జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఆ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. ఏడు వికెట్లు కోల్పోయి 152 రన్స్ చేసింది. 153 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సులువుగా విజయం సాధించింది..

Written By:
  • Bhaskar
  • , Updated On : July 14, 2024 / 08:18 AM IST
    Follow us on

    Zimbabwe vs India : టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా మరో సిరీస్ దక్కించుకుంది. జింబాబ్వే తో జరుగుతున్న 5 t20 మ్యాచ్ ల సిరీస్ ను.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 4-1 తేడాతో సొంతం చేసుకుంది. శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన నాలుగో టి20 మ్యాచ్లో భారత్ పది వికెట్ల తేడాతో జింబాబ్వే జట్టును మట్టికరిపించింది.. ఈ విజయం ద్వారా టీమ్ ఇండియా పై ప్రశంసల జల్లు కురుస్తున్నప్పటికీ.. కెప్టెన్ గిల్ ను మాత్రం నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. సోషల్ మీడియాలో అతడి పేరును తెగ ట్రోల్ చేస్తున్నారు.”నువ్వేం మనిషివి రా బాబూ.. స్వార్థానికి మారుపేరు లాగా మారిపోయావు అంటూ” మండిపడుతున్నారు.

    నాలుగో టి20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గిల్ టాస్ గెలిచాడు. జింబాబ్వే జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఆ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. ఏడు వికెట్లు కోల్పోయి 152 రన్స్ చేసింది. 153 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సులువుగా విజయం సాధించింది.. టి20 వరల్డ్ కప్ లో రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన యశస్వి జైస్వాల్.. నాలుగో టి20 మ్యాచ్ లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్ ఎవరైనా చూడకుండా బాదుడే మంత్రంగా పెట్టుకున్నాడు. ఏకంగా 13 ఫోర్లు కొట్టాడు. రెండు సిక్సర్లు బాదాడు. అజేయంగా 93 పరుగులు చేశాడు. వాస్తవానికి జైస్వాల్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు.. కానీ సెంచరీకి అతడు ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.. ఇక మరో ఓపెనర్ గిల్ 58 పరుగులు చేశాడు.. అయితే జైస్వాల్ సెంచరీకి ఏడు పరుగుల దూరంలో ఉండడం పట్ల కెప్టెన్ గిల్ పై విమర్శలు వ్యక్తమౌతున్నాయి..

     

    వాస్తవానికి టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో.. జట్టు విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో జైస్వాల్ 83 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి సెంచరీ పూర్తి చేసేందుకు సువర్ణావకాశం లభించింది. అయితే అతనికి గిల్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. స్ట్రైక్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. దానిని పూర్తిగా తన వద్ద ఉంచుకున్నాడు. ఫలితంగా జైస్వాల్ కు సెంచరీ సాధించే అవకాశం లేకుండా పోయింది. సెంచరీకి ఏడు పరుగుల దూరంలో ఉండిపోవాల్సి వచ్చింది. యశస్వి ఎంత ప్రయత్నించినప్పటికీ గిల్ ఏమాత్రం స్ట్రైక్ ఇవ్వలేదు. అతడు సైగలు చేసినప్పటికీ గిల్ పెద్దగా పట్టించుకోలేదు. పైగా తను మాత్రమే బ్యాటింగ్ చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించాడు. జిడ్డు లాగా అలాగే పట్టుకొని ఉండడంతో చేసేదేం లేక యశస్వి జైస్వాల్ అలానే చూస్తుండిపోయాడు.

    ఈ నేపథ్యంలో గిల్ పై అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ ఫ్యాన్స్ గిల్ పై మండిపడుతున్నారు.” నువ్వు భావి భారత కెప్టెన్ వి అవుతావని బీసీసీఐ అవకాశం కల్పించింది. గత ఇన్నింగ్స్ లలో సరిగా ఆడకపోయినప్పటికీ దగ్గరికి తీసింది. రెండో టీ20 లో తేలిపోయినప్పటికీ బీసీసీఐ కెప్టెన్ గా కొనసాగించింది. అయినప్పటికీ నీలో ఏమాత్రం విశ్వాసం లేదు. తోటి ఆటగాడి సెంచరీని అడ్డుకుంటావా. మరీ ఇంత స్వార్థపరుడువేంటీ?, కాస్త స్ట్రైక్ ఇచ్చేస్తే యశస్వి జైస్వాల్ సెంచరీ చేసేవాడు కదా. అతడి సెంచరీని అడ్డుకున్నావు. భావి భారత కెప్టెన్ ఇలా చేస్తారా? నాయకుడంటే ఇలా ఉంటారా? ఇలా ఉంటే నాయకుడివి ఎలా అవుతావు? పదిమందికి నువ్వు దారి చూపించాలి.. అంత తప్ప వ్యక్తిగత స్వార్ధాన్ని పెట్టుకుని మోసం చేయకూడదు. నువ్వు సరిగ్గా ఆడకపోవడం వల్లే ఇటీవల టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభించలేదు. పైగా ఇలాంటి బుద్ధులు కూడా ఉన్నాయని ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇలాంటప్పుడు నిన్ను వచ్చే మ్యాచ్ లకు ఎంపిక చేస్తారానేది అనుమానమేనని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

    టీమిండియా సిరీస్ గెలిచినప్పటికీ.. అభిమానులు గిల్ చేసిన పని పట్ల ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. పైగా అతనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కెప్టెన్ అయి ఉండి ఇలాంటి ఆట తీరు ప్రదర్శించడమేంటని మండిపడుతున్నారు. తోటి ఆటగాడు సెంచరీ చేసుకునే అవకాశం ఉంటే.. దానిని మట్టిపాలు చేయడం ఏంటని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గిల్ ఆటతీరు పూర్తిగా మార్చుకోవాలని, స్వార్ధాన్ని పూర్తిగా కట్టిపెట్టాలని హితవు పలుకుతున్నారు.