https://oktelugu.com/

BCCI: బీసీసీఐ ఇచ్చిన 125 కోట్లల్లో.. పక్షపాత వైఖరి.. అందరికీ సమాన వాటా ఇవ్వలేదట?!

BCCI: క్షిణాఫ్రికాపై ఫైనల్ మ్యాచ్లో గెలిచిన ఆటగాళ్లతో పాటు రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన ఆటగాళ్లకు కూడా ప్రైజ్ మనీ ఇచ్చారు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లకు నజరానా దక్కింది. సహాయక సిబ్బంది, ఫిజియోథెరపిస్ట్, త్రో డౌన్ స్పెషలిస్ట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ లకు కూడా నగదు బహుమతి

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 8, 2024 / 05:38 PM IST

    Which player will get the biggest share in BCCI prize money

    Follow us on

    BCCI: టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా పై జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా రెండవసారి t20 వరల్డ్ కప్ సాధించిన చరిత్రను టీమిండియా దక్కించుకుంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల సరసన నిలిచింది. ఇదే క్రమంలో 17 ఏళ్ల సుదీర్ఘ తెర దించింది. ఈ విజయం నేపథ్యంలో టీమిండియా లో ఘనంగా సంబరాలు చేసుకుంది. జట్టు ఆటగాళ్లకు బిసిసిఐ ఏకంగా 125 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల ముంబైలో నిర్వహించిన విక్టరీ పరేడ్ లో 125 కోట్ల చెక్కును టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ అందించింది. అయితే ఈ 125 కోట్లల్లో ఎవరికి ఎంత వాటా దక్కిందంటే..

    దక్షిణాఫ్రికాపై ఫైనల్ మ్యాచ్లో గెలిచిన ఆటగాళ్లతో పాటు రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన ఆటగాళ్లకు కూడా ప్రైజ్ మనీ ఇచ్చారు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లకు నజరానా దక్కింది. సహాయక సిబ్బంది, ఫిజియోథెరపిస్ట్, త్రో డౌన్ స్పెషలిస్ట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ లకు కూడా నగదు బహుమతి ఇవ్వనున్నారు. వీళ్లతో పాటు టీమిండియాను ఎంపిక చేసిన సెలెక్టర్లు, రిజర్వ్ ప్లేయర్లకు కూడా ప్రైజ్ మనీ అందివ్వనున్నారు. అయితే వీరందరికీ సమాన వాటా ఇవ్వలేదని తెలుస్తోంది.

    జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం టీమ్ ఇండియాలో 15 మంది ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, సంజు శాంసన్, జైస్వాల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, సిరాజ్, కోచ్ రాహుల్ ద్రావిడ్ కు తలా ఐదు కోట్లు అందనున్నాయి. ఇక బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లకు తలా 2.5 కోట్లు ఇవ్వనున్నారు. సహాయక సిబ్బంది గా ఉన్న తొమ్మిది మందికి తలా రెండు కోట్లు ఇస్తారు. అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు, రిజర్వ్ ఆటగాళ్లయిన రింకూ సింగ్, గిల్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ కు తలా ఒక కోటి ఇవ్వనున్నారు.

    జాతీయ మీడియాలో వార్తల నేపథ్యంలో సోషల్ మీడియాలో పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. 125 కోట్లల్లో పక్షపాత వైఖరి అవలంబించారని.. సత్తా ఉన్న ఆటగాళ్లను ఎక్స్ ట్రా ప్లేయర్లుగా ఎంపిక చేసి.. రూ..కోటి ముఖాన కొట్టారని కొంతమంది అభిమానులు ఆరోపిస్తున్నారు. రవీంద్ర జడేజా, దూబే లాంటి ఆటగాళ్లను ఎంపిక చేసి పరువు తీసుకున్నారని విమర్శిస్తున్నారు.