Shah Rukh Khan: రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరవుతారు? ఎవరి వైపు బీసీసీఐ మొగ్గు చూపుతుంది? ఇంతవరకు ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభించలేదు. కోచ్ పదవికి సంబంధించి బిసిసిఐ దరఖాస్తులు కోరితే.. కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఇందులో ఫేక్ దరఖాస్తులు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో ఐపీఎల్(IPL) ఫైనల్ లో కోల్ కతా హైదరాబాద్ పై విజయం సాధించడంతో కోచ్ రేసు లో ఒక్కసారిగా గౌతమ్ గంభీర్ పేరు తెరపైకి వచ్చింది. మెంటార్ గా కోల్ కతా జట్టు రూపురేఖలను సమూలంగా మార్చిన నేపథ్యంలో అతనితో బీసీసీఐ(BCCI) సెక్రటరీ జై షా చర్చలు జరిపారని, త్వరలో అతడి నియామకం జరుగుతుందని.. ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటిపై కూడా ఒక స్పష్టత అంటూ లేకుండా పోయింది. అసలు గౌతమ్ గంభీర్ కోచ్ పదవి కోసం దరఖాస్తు కూడా చేయలేదని కొన్ని జాతీయ న్యూస్ ఛానల్స్ కథనాలను వెలువరించాయి.
కోల్ కతా జట్టు పై గౌతమ్ గంభీర్ కు అపారమైన ప్రేమ ఉందని, షారుక్ ఖాన్(Shah Rukh Khan) తో అద్భుతమైన బాండింగ్ ఉందని.. అలాంటప్పుడు అతడు టీమిండియా కోచ్ గా ఎలా వస్తాడనే వాదనలు కూడా వినిపించాయి.. ఫలితంగా అతను టీమిండియా కోచ్ గా వచ్చే అవకాశాలు లేవని కొంతమంది కొట్టి పారేశారు.. వాస్తవానికి కోల్ కతా జట్టు అత్యంత విజయవంతంగా మారడానికి ప్రధాన కారణం గౌతమ్ గంభీర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2012, 2014లో గంభీర్ నాయకత్వంలో కోల్ కతా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు ఎత్తుకుంది. 2024లో హైదరాబాద్ జట్టుపై ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది. మూడుసార్లు కోల్ కతా విజేతగా నిలవడం వెనక గౌతమ్ గంభీర్ పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది. పైగా ఐపీఎల్ చరిత్రలో చెన్నై, ముంబై తర్వాత అత్యంత విజయవంతమైన జట్టుగా కోల్ కతా నిలిచింది.
Also Read: T20 World Cup 2024: ఇవి అమెరికా క్రాస్ బ్రీడ్ పిచ్ లు.. ఎంతకీ అర్థం కావు.. కొరుకుడు పడవు..
కోల్ కతా ట్రోఫీ గెలవడంతో.. గౌతమ్ గంభీర్ ను సుదీర్ఘకాలం ఫ్రాంచైజీ తో కొనసాగించాలని షారుక్ ఖాన్ భావిస్తున్నాడని తెలుస్తోంది. పైగా షారుక్ ఖాన్ బ్లాంక్ చెక్ కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కోల్ కతా కు గౌతమ్ గంభీర్ గుడ్ బై చెబుతున్నట్టు.. త్వరలో భారత క్రికెట్ జట్టు కోచ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు..”టీమ్ ఇండియా కోచ్ గా ఉండడాన్ని ఆస్వాదిస్తా. 140 కోట్ల భారతీయులు ఇష్టంగా చూసే క్రికెట్ క్రీడకు కోచ్ గా పనిచేయడానికి మించిన బాధ్యతలు ఏవీ ఉండవు.” అని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.. ఈ వ్యాఖ్యలతో గౌతమ్ గంభీర్ మనసులో మాట తెలిసిపోయిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు..కోల్ కతా ను వదిలిపెట్టి టీమిండియా కోచ్ గా అతడు రావడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.
Also Read: Aaron Jones: వారెవ్వా జోన్స్.. ఒక్క మ్యాచ్ లోనే గేల్, యువి రికార్డులను మడత పెట్టేశాడుగా..
టీమిండియా కొత్త కోచ్ 27 డిసెంబర్ 31 వరకు బాధితులు నిర్వర్తించాల్సి ఉంటుంది.. ఒకవేళ టీమ్ ఇండియాకు కోచ్ గా ఎంపిక అయితే గౌతమ్ కంపెనీ కోల్ కతా జట్టు కు మెంటార్ గా వ్యవహరించే అవకాశం ఉండదు. 2027 వరకు అతడు కోల్ కతా కు పనిచేసే సౌలభ్యం దక్కదు. బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం భారత జట్టు కోచ్ ఏ ఫ్రాంచైజీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలు అందించేందుకు అవకాశం లేదు. కాగా, గంభీర్ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు పలు విధాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు..” అసలే ముక్కోపి, పైగా అహంబావి.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పేముంది.. షారుక్ ఖాన్ కు కోలుకోలేని షాక్ తగిలింద”నే అర్థం వచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు.