Gautam Gambhir Resign: క్రికెట్ చరిత్రలో.. టీమిండియా సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్‌వాష్ అయింది. దీనికి క్రికెటర్ల నిర్లక్ష్యం ఒక కారణమైతే.. కోచ్ గౌతం గంభీర్ ప్రయోగాలు మరోకారణం. కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది దాటినా ఇప్పటికీ జట్టుపై పట్టు సాధించలేదు. ప్రతీ సిరీస్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. ఏడాదిలో ఆయన ప్రయోగాలు రెండు మూడుసార్లే సక్సెస్ అయ్యాయి. పదులసార్లు విఫలం అయ్యాయి. తాజాగా తన ప్రయోగాలతో టీమిండియా క్రికెట్ పరువు తీశాడు. 148 ఏళ్ల చరిత్రలో తొలిసారి సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్‌వాష్ అవడానికి కారణమయ్యాడు. దీంతో కోచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజీనామా యోచనలో గంభీర్..
సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ’నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్‌గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.
కోచ్ పాత్ర కీలకం..
క్రికెట్‌లో కోచ్ పాత్ర చాలా కీలకం. అలాంటి పోస్టులో ఉన్న గంభీర్ నిర్లక్ష్యపు నిర్ణయాల కారణంగా భారత క్రికెటర్లు నిలకడగా ఆడలేకపోతున్నారు. ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపిస్తోంది. ప్రస్తుతం జట్టుకు మార్పులు అతి అవసరం, అందులో కోచ్ పాత్ర కీలకం అని బోర్డు కూడా గుర్తిస్తుంది. సొంత నిర్ణయాలను జట్టుపై రుద్దుతూ గంభీర్ టీమిండియా వైఫల్యానికి పరోక్షంగా కారణం అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
రాజీనామా చేస్తారా..
బీసీసీఐ కూడా గంభీర్ తీరుపై గుర్రుగా ఉంది. అందుకే గంభీర్ తన భవిష్యత్ బీసీసీఐ చేతిలో ఉందని వ్యాక్యానించినట్లు తెలుస్తోంది. తాజా ఓటమి భారత క్రికెట్‌కు ఒక మచ్చగా మారింది. ఈ నేపథ్యంలో గంభీర్ స్వయంగా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. లేదంటే బీసీసీఐ కూడా బలవంతంగా రాజీనామా చేయించే అవకాశం ఉంది. భారత క్రికెట్ అభివృద్ధికి సరైన మార్గదర్శకులు కావాలని బీసీసీఐ ఆశిస్తోంది. అవసరమైతే కొత్త మార్గాలను అన్వేషించి జట్టును గెలుపు బాట పట్టించాలన్న ఆలోచనలో ఉంది.