Temba Bavuma Iron Man: ప్రఖ్యాతమైన లార్డ్స్ మైదానం.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి.. ఆస్ట్రేలియా విజయం మీద ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. పైగా దక్షిణాఫ్రికా సంచలన ప్రదర్శన చేస్తుందని పెద్దగా అంచనాలు లేవు. అంతేకాదు అప్పటికే జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఎలాగూ వారి మీద చోకర్స్ అనే ముద్ర కూడా ఉంది.
లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టును పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. బలమైన ఆస్ట్రేలియా జట్టును అన్ని విధాలుగా వెనుకబడే విధంగా చేశాడు. ప్రతి బంతిని.. ప్రతి పరుగును అంచనా వేశాడు. దానికి తగ్గట్టుగానే ప్రణాళిక రూపొందించి అమలు చేశాడు.. చివరికి దక్షిణాఫ్రికా జట్టును విజేతను చేశాడు. అంతేకాదు 21 శతాబ్దంలో సౌత్ ఆఫ్రికా జట్టుకు ఐసీసీ టైటిల్ అందించిన తొలి సారధి అయ్యాడు. తన పేరును విజయానికి చిరునామగా మార్చాడు బవుమా.. అంతేకాదు ప్రస్తుత ఐడిఎఫ్సి టెస్ట్ సిరీస్ లో.. టీమిండియా గడ్డమీద టీమ్ ఇండియాను ఓడించి.. 15 సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికా ను గెలిపించాడు. అంతేకాదు గడిచిన 11 టెస్టులలో పది టెస్టులు గెలిపించి.. సౌత్ ఆఫ్రికా ను తిరుగులేని స్థాయిలో నిలబెట్టాడు బవుమా.
బవుమా ఎత్తు తక్కువగా ఉంటాడు. నలుపు రంగులో ఉంటాడు. బ్యాటింగ్ కూడా విచిత్రంగా చేస్తాడు. వాస్తవానికి క్రికెట్లో అటువంటి వ్యక్తిని చూస్తే ఎవరైనా సరే గేలి చేస్తారు. చివరికి టీమిండియా బౌలర్ బుమ్రా కూడా బవుమా ను గెలిచేసాడు. మరుగుజ్జు అంటూ హేళన చేశాడు. అయినప్పటికీ బవుమా బాధపడలేదు. అంతేకాదు రెండవ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. కోల్ కతా టెస్ట్ ను టీమ్ ఇండియా నుంచి దూరం చేసాడు. బోష్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించాడు. తద్వారా టీమిండియా కు ఊహించని ఓటమిని అందించాడు.
క్రికెట్లో ఆజానుబాహులు ఉండొచ్చు. అద్భుతమైన రంగుతో అందమైన రాజకుమారులు ఉండొచ్చు. కానీ బవుమా వాటన్నింటికీ భిన్నం. అతడు ఎలాగైనా ఆడతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడతాడు. తన జట్టు కోసం మాత్రమే ఆడతాడు. అందువల్లే దక్షిణాఫ్రికా జట్టును టెస్టులలో తిరుగులేని స్థాయిలో నిలిపాడు. చివరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో విజేతను చేశాడు. అతడు ఉంటే దక్షిణాఫ్రికా జట్టుకు తిరుగులేదు.