Ind Vs Aus 5th Test: పెర్త్ టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. అయితే అదే జోరు తదుపరి మ్యాచ్లలో కొనసాగించలేకపోయింది. కొన్ని మ్యాచ్లలో బౌలింగ్లో విఫలం కావడం.. మరికొన్ని మ్యాచ్లో బ్యాటింగ్లో నిరాశపరిచింది. వికెట్లు తీయాల్సిన సమయంలో.. పరుగులు రాబట్టాల్సిన సందర్భంలో టీమిండి ఆటగాళ్లు విఫలం కావడంతో జట్టు జట్టు ఓడిపోవాల్సి వచ్చింది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఓడిపోయింది. ఆ ఓటమి తర్వాత పెర్త్ టెస్టులో టీమిండియా విజయం సాధించిన తర్వాత గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ పాత ఆట తీరు ప్రదర్శించడంతో అభిమానులు ఆవేదన చెందుతున్నారు.. గెలవాల్సినచోట.. నిలబడాల్సిన చోట.. ధైర్యంగా ప్రతిఘటించాల్సిన చోట.. ఇలా చేతులెత్తేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటగాళ్లు తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. త్వరగా జట్టుకు వీడ్కోలు పలకాలని.. కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలని వ్యాఖ్యానిస్తున్నారు.
కొత్త జెర్సీతో..
టీమిండియాతో సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి జరిగే నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా కొత్త జెర్సీతో కనిపించనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా సిడ్నీ స్టేడియం మొత్తం గులాబీ రంగులో కనిపిస్తుంది.. ఆటగాళ్లు కూడా గులాబీ రంగు టోపీలను ధరిస్తారు.. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి ఆస్ట్రేలియా క్రికెటర్లు ఈ పని చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మెక్ గ్రాత్ సతీమణి క్యాన్సర్ తో పోరాడుతూ 2008లో కన్నుమూసింది. తన భార్య వినియోగాన్ని తట్టుకోలేక.. చాలా రోజులపాటు మెక్ గ్రాత్ బయటికి రాలేదు. ఆ తర్వాత తనకు తాను సర్ది చెప్పుకొని.. సమాజ హితం కోసం ఏదైనా చేయాలని భావించాడు. ఇందులో భాగంగా తన భార్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. దానిద్వారా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి సాంత్వన అందిస్తున్నాడు. తన ఫౌండేషన్ ద్వారా నిధులు కేటాయించి క్యాన్సర్ రోగుల కోసం ఖర్చు చేస్తున్నాడు.. ఇప్పటికే మెక్ గ్రాత్ తన ఫౌండేషన్ ద్వారా భారీగా నిధులు సేకరించి.. క్యాన్సర్ రోగుల కోసం ఖర్చు చేశాడు..” స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. మారుతున్న కాలానుగుణంగా స్త్రీలలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందువల్ల వారు క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. అలాంటివారికి చేయూత అందించేందుకు మెక్ గ్రాత్ ముందుకు వచ్చాడు. తన భార్య పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తున్నాడు. ఆ నిధులు మొత్తం క్యాన్సర్ రోగుల చికిత్స కోసం ఖర్చు చేస్తున్నాడు. ఇప్పటివరకు వేలాదిమంది అతడి ఫౌండేషన్ ద్వారా సహాయం పొందారు. ఇంకా సహాయాన్ని ఆర్జించేవారు చాలామంది ఉన్నారు. వారి కోసం మెక్ గ్రాత్ తపన పడుతున్నాడు. అతడి తపన అర్థం చేసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా.. సిడ్నీ టెస్టులో జట్టు మొత్తానికి పింక్ కలర్ జెర్సీ ని రూపొందించిందని” ఆస్ట్రేలియా మీడియా తన కథనాలలో పేర్కొన్నది.