https://oktelugu.com/

Team India victory: సిగ్గులేని ఆస్ట్రేలియా మీడియా.. టీమిండియా విజయం పై అంకమ్మ శివాలు

Team India victory: టీమిండియా సాధించిన విజయం పట్ల అంతర్జాతీయ మీడియా ప్రత్యేకంగా స్పందించింది.. పాకిస్తాన్ లోని విశేష ఆదరణ పొందిన డాన్ పత్రిక టీమిండియా విజయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 1, 2024 / 02:21 PM IST

    Australian Media Crying on Team India victory

    Follow us on

    Team India victory: ఎవరైనా విజయం సాధిస్తే అభినందించాలి. ఆ విజయాన్ని చూసి కళ్ళు మండితే సైలెంట్ గా వెళ్ళిపోవాలి. అంతే తప్ప విమర్శలు చేయకూడదు. ఆ గెలుపును తక్కువ చేసి చూసేలా మాట్లాడకూడదు. అన్నింటికీ మించి మించి కళ్ళల్లో నిప్పులు పోసుకోకూడదు. కానీ ఇవన్నీ ఆస్ట్రేలియా మీడియా చేసింది. టీమిండియా విజయాన్ని ఓర్వలేక అంకమ్మ శివాలూగింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై టీమిండియా విజయం సాధిస్తే.. అది విజయం కాదన్నట్టుగా.. తెర వెనుక ఏవో జరిగాయనట్టుగా ఊహించుకొని.. ఊహాజనిత వార్తలు రాసింది.

    టీమిండియా సాధించిన విజయం పట్ల అంతర్జాతీయ మీడియా ప్రత్యేకంగా స్పందించింది.. పాకిస్తాన్ లోని విశేష ఆదరణ పొందిన డాన్ పత్రిక టీమిండియా విజయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడని.. ప్రస్తావించింది. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు టీమిండియా కు శుభాకాంక్షలు తెలిపిన తీరును ప్రత్యేకంగా అచ్చేసింది. ఇక లండన్ కేంద్రంగా ప్రచురితమయ్యే సండే టైమ్స్ పత్రిక.. కోహ్లీ మార్క్ ఆట తీరును ప్రత్యేకంగా ప్రశంసించింది. “కోహ్లీ భారత్ కప్ అందించాడు. గేర్ మార్చి సరికొత్త ఆట తీరును ప్రదర్శించాడని” తన కథనంలో పేర్కొంది. ఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ దక్షిణాఫ్రికా ఒత్తిడికి తలవంచిందని రాసుకొచ్చింది. ఇక టెలిగ్రాఫ్ పత్రిక భారత విజయాన్ని గొప్పగా అభివర్ణించింది. ఒత్తిడిని జయించి కప్ సాధించారని పేర్కొంది. కీలకమైన మ్యాచ్ లలో చేతులు ఎత్తివేసే సంస్కృతిని దక్షిణాఫ్రికా కొనసాగించిందని ప్రస్తావించింది. విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం నుంచి ఇబ్బంది పడినప్పటికీ.. మ్యాచ్లో సత్తా చాటాడని కొనియాడింది.

    ఇక ఆస్ట్రేలియా కు చెందిన సిడ్ని మార్నింగ్ హెరాల్డ్ పత్రిక టీం ఇండియా విజయం పట్ల అక్కసు వెళ్ళగక్కింది. “ఒత్తిడిలో భారత జట్టుకు దక్షిణాఫ్రికా కప్ అందించిందని” వార్తను రాసుకొచ్చింది. “దక్షిణాఫ్రికా తడబాటు భారత జట్టుకు ట్రోఫీ అందించింది. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా కు అన్నీ అనుకూరించాయి. అంపైర్ల నిర్ణయాలతో టీమిండియా కప్ దక్కించుకుందని” సిడ్నీ మార్నింగ్ పత్రిక పేర్కొంది. అయితే కీలకమైన సూపర్ -8 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. కంగారు జట్టును ఇంటికి పంపింది. అయితే దాని జీర్ణించుకోలేకనే టీమిండియా పై ఆస్ట్రేలియా మీడియా అక్కసు వెళ్లగక్కిందని భారత అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.