Sunrisers Hyderabad: ప్లే ఆఫ్ కు ముందు సన్ రైజర్స్ కు కోలుకోలేని దెబ్బ

మే 23న తొలి టి20 జరుగుతుంది. మే 25న రెండవ టి20 మ్యాచ్, మే 26న చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ జమైకాలోని సబీనా పార్క్ స్టేడియంలో జరుగుతాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : May 13, 2024 1:08 pm

Sunrisers Hyderabad

Follow us on

Sunrisers Hyderabad: ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పంజాబ్, ముంబై ప్లే ఆఫ్ రేసు నుంచి బయటకు వచ్చాయి. కోల్ కతా జట్టు అధికారికంగా ప్లే ఆఫ్ కు వెళ్లిపోయింది. రాజస్థాన్ కూడా తన బెర్త్ ఖరారు చేసుకుంది. ఆదివారం నాటి మ్యాచ్లో రాజస్థాన్ పై గెలిచి చెన్నై జట్టు కూడా ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది. చెన్నై జట్టు రాజస్థాన్ పై గెలవడం ద్వారా మూడవ స్థానంలోకి వచ్చింది. నిన్నటిదాకా మూడవ స్థానంలో ఉన్న హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ తరుణంలో హైదరాబాద్ జట్టు ఆడే తదుపరి మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో గెలిస్తేనే హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ దశలో హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఎందుకంటే హైదరాబాద్ జట్టులో ఉన్న సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఆటగాళ్లు మెగా లీగ్ కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. వెస్టిండీస్ దేశంలో టి20 సిరీస్ నిర్వహిస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ కంటే ముందు దక్షిణాఫ్రికా తో వెస్టిండీస్ 3 t20 మ్యాచ్ ల సిరీస్ కు ఆతిథ్యం ఇస్తోంది.

మే 23న తొలి టి20 జరుగుతుంది. మే 25న రెండవ టి20 మ్యాచ్, మే 26న చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ జమైకాలోని సబీనా పార్క్ స్టేడియంలో జరుగుతాయి. ఇదే సమయంలో ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచులు జరగనున్నాయి. ఈ సిరీస్ కు వెస్టిండీస్ తో పాటు, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా వెళ్లనున్నారు. ఇక ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ మే 21న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత రోజు అంటే మే 22న ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. మే 24 న చెన్నైలోని చిదంబరం మైదానంలో క్వాలిఫైయర్ -2 మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇదే వేదికపై మే 26న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది.

వెళ్లిపోయే ఆటగాళ్లు వీరే

పావెల్ రాజస్థాన్ రాయల్స్, హిట్మేయర్ రాజస్థాన్ రాయల్స్, అల్జారి జోసెఫ్ బెంగళూరు, హోప్ ఢిల్లీ, జోసెఫ్ లక్నో, నికోలస్ పూరన్ లక్నో, అండ్రి రస్సెల్ కోల్ కతా, షెఫర్డ్ ముంబై, మార్క్రం హైదరాబాద్, క్లాసెన్ హైదరాబాద్, జాన్సన్ హైదరాబాద్, కోయేట్జీ ముంబై, క్వింటన్ డికాక్ లక్నో, కేశవ్ మహారాజ్ రాజస్థాన్, డేవిడ్ మిల్లర్ గుజరాత్, నోర్ట్జే గుజరాత్, కగీసో రబాడ పంజాబ్, ట్రిస్టన్ స్టబ్స్ ఢిల్లీ..

వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆడే టీమ్ లలో హైదరాబాద్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ జట్టులో ఉన్న మార్క్రం, క్లాసెన్, జాన్సన్ వంటి వారు కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఆ జట్టు ప్లే ఆఫ్ ముందుకు వచ్చిందంటే అందులో వీరి పాత్ర విడదీయరానిది. ఈ నేపథ్యంలో ఆ ఆటగాళ్లు మూడు t20 ల సిరీస్ లో భాగంగా స్వదేశానికి వెళ్తే మాత్రం.. హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని నష్టమే. మరి దీనిని ఆ జట్టు ఏ విధంగా భర్తీ చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.