https://oktelugu.com/

Ajit Agarkar: ఆస్ట్రేలియాలోనే అగార్కర్.. బీసీసీఐ ఏదో పెద్ద ప్లానే వేసింది..

టీమిండియా ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఉంది. ఈనెల 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా తో తలపడుతుంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు ముమ్మరమైన సాధన చేస్తున్నారు. రోహిత్ వ్యక్తిగత కారణాలతో దూరం కావడంతో తొలి టెస్ట్ కు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 21, 2024 7:47 am
Ajit Agarkar

Ajit Agarkar

Follow us on

Ajit Agarkar: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇంకా ప్రారంభం కాకముందే బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. భారత క్రికెట్ జట్టుకు సెలక్షన్ కమిటీ చీఫ్ గా అజిత్ అగర్కార్ కొనసాగుతున్నాడు.. అయితే అతడిని ఆస్ట్రేలియాలో ఉండాలని బీసీసీఐ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి జట్టును ఎంపిక చేసిన అనంతరం.. జట్టుతోపాటు కోచ్ మాత్రమే పర్యటించే దేశానికి వెళ్తాడు. అయితే ఇప్పుడు అజిత్ అగార్కర్ ను ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ వరకు అక్కడే ఉండాలని బీసీసీఐ పెద్దలు చెప్పేశారట. అయితే దీని వెనక పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ భవితవ్యాన్ని తేల్చడానికి అజిత్ ను అక్కడ ఉండాలని చెప్పినట్టు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటించింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తలపడింది.. ఈ సిరీస్లో భారత్ వైట్ వాష్ కు గురైంది. బీసీసీఐ పెద్దలు గౌతమ్ గంభీర్ ఒక నిర్ణయానికి వచ్చారు. అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ తో కలిసి ఆస్ట్రేలియా టూర్లో ఇండియన్ ప్లేయర్ల ఆట తీరును జాగ్రత్తగా పరిశీలిస్తారు.. సీనియర్ ఆటగాళ్లతో చర్చిస్తారు. వారు ఎంతకాలం క్రికెట్ ఆడతారో తెలుసుకోవాలని అజిత్ అగార్కర్ కు సూచించినట్టు తెలుస్తోంది.

నెలన్నర ఆస్ట్రేలియాలోనే..

ఆస్ట్రేలియా టూర్ లో భారత్ దాదాపు నెలన్నర రోజులపాటు ఉంటుంది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడుతుంది. ఇది వన్డే ఫార్మేట్ లో జరుగుతుంది. వన్డే ఆటగాళ్లుగా రోహిత్, విరాట్ ఇప్పటికీ ఫామ్ లోనే ఉన్నారు. ఒకవేళ భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు అర్హత సాధిస్తే జూన్ వరకు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోనే ఉంటారు. మరోవైపు నాలుగో డబ్ల్యూటీసి సీజన్ 2025 -27 ను భారత్ ఇంగ్లాండ్ సీరీస్తో మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ చెట్టుతో భారత్ ఐదో టెస్టులు ఆడుతుంది. అయితే ఆ సీజన్ ముగిసే వరకు రోహిత్ 39 సంవత్సరంలోకి అడుగు పెడతాడు. విరాట్ 38 సంవత్సరాలకు చేరుకుంటాడు. ఇక వన్డే ప్రపంచ కప్ 2027 రానే వస్తుంది.. అలాంటప్పుడు విరాట్ – రోహిత్ ను జట్టులో కొనసాగిస్తారా? యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంటుంది. అందువల్లే ఇప్పటినుంచే సీనియర్ ఆటగాళ్లను జట్టు మేనేజ్మెంట్ ఒక గంట కనిపెడుతోంది. ” బీసీసీఐ.. జట్టును బలోపేతం చేసుకోవడంతో పాటు.. సీనియర్ ఆటగాళ్ల మనసులో ఉన్న మాటను తెలుసుకోవాలని భావిస్తోంది. వారిని వెంటనే తొలగించకుండా.. సేవలను వినియోగించుకుంటూనే.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. అందువల్ల ఇలాంటి ప్రయోగాన్ని చేపడుతోంది. సీనియర్ ఆటగాళ్లు జట్టుకు చేసిన సేవలను గుర్తిస్తూనే.. జట్టు అవసరాలను కూడా వారి ముందు ఉంచుతోంది. మొత్తంగా బీసీసీఐ తీసుకున్న సంచలన నిర్ణయం సానుకూల విధానాల్లో సాగుతోంది. ఇది గొప్ప పరిణామం. అయితే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు.. ఈ నిర్ణయానికి కూడా అదే స్థాయిలో పదును ఉంది. దీన్ని డీల్ చేసిన విధానాన్ని బట్టే జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుందని” మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.