Rahmadullah Gurbaz : ఇప్పటికే తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ను ఆఫ్ఘాన్ జట్టు ఓడించింది. రెండవ మ్యాచ్ లోనూ అదే గెలుపును పునరావృతం చేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను 177 రన్స్ తేడాతో దారుణంగా ఓడించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ వశం చేసుకుంది. వన్డేలలో ఆఫ్గనిస్తాన్ జట్టుకు ఇదే అత్యంత భారీ విజయం. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుకు ఇది ఐదవ అతిపెద్ద పరాజయం.. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి.. సంచలనాలు సృష్టించింది. గుర్బాజ్ 105 రన్స్ చేశాడు. అజ్మతుల్లా 86 పరుగులు సాధించాడు. రహమత్ 50 పరుగులతో ఆకట్టుకున్నాడు . దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్క్ రమ్, ఎంగిడి, బర్గర్, పీటర్ తలా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ విధించిన 312 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో దక్షిణాఫ్రికా తడబడింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ 134 పరుగులకే కుప్ప కూలింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా 38 పరుగులతో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ (5/19) పాంచ్ పటాకా సృష్టించాడు. మొత్తం హ్యాండ్ ఖరోటె(4/26) నాలుగు టికెట్లు దక్కించుకున్నాడు.
అనేక ఘనతలు
ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరుపున సెంచరీ చేసిన ఓపెనర్ గుర్బాజ్ అనేక ఘనతలను సృష్టించాడు. వన్డేలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరఫున హైయెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఆవిర్భవించాడు. గుర్బాజ్ వయసు 22 సంవత్సరాలు. ఇంత చిన్న వయసుకే అతడు ఆ స్థాయిలో రికార్డు అందుకోవడం గమనార్హం. 42 వన్డేలలో అతడి ఏకంగా ఏడు శతకాలు చేశాడు. ఈ ఘనత అంతకుముందు మహమ్మద్ షాజాద్(6) పేరు మీద ఉండేది. ఇది మాత్రమే కాకుండా గుర్బాజ్ మరో రికార్డు సృష్టించా. 23 సంవత్సరాల లోపు వన్డేలలో హైయెస్ట్ సెంచరీలు చేసిన మూడవ ఆటగాడిగా అతడు విరాట్ కోహ్లీతో సమంగా నిలిచాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ ను అధిగమించాడు. ఈ లిస్టులో భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్ (8), క్వింటన్ డికాక్ (8), గుర్బాజ్(7), విరాట్ కోహ్లీ (7), బాబర్ ఆజాం (6), ఉపుల్ తరంగ(6) టాప్ స్థానాలలో కొనసాగుతున్నారు. గుర్బాజ్ చేసిన సెంచరీ తో ఆఫ్గనిస్తాన్ భారీ స్కోర్ చేసింది.. దక్షిణాఫ్రికా ఎదుట భారీ లక్ష్యం ఉంచింది. అయితే దానిని ఛేదించడంలో దక్షిణాఫ్రికా జట్టు పూర్తిగా విఫలమైంది. దీంతో ఆఫ్గనిస్తాన్ జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని.. సిరీస్ దక్కించుకుంది.