కరోనా: ఐపీఎల్ ను వీడుతున్న విదేశీ ఆటగాళ్లు

కరోనా భయం ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లను కూడా ఆవహించింది. వారు దేశంలో చోటుచేసుకుంటున్న కరోనా కల్లోలానికి భయపడిపోతున్నారు. అందుకే వరుసగా ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత్ ను వీడి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ కు విమానాలను మే 15 వరకు నిషేధించడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. భారత్ లో కరోనా మే 15 వరకు ఉధృతం అవుతుందని.. రోజుకు 10 లక్షల కేసులు నమోదై పరిస్థితులు చేయిదాటిపోతాయన్న […]

Written By: NARESH, Updated On : April 27, 2021 6:00 pm
Follow us on

కరోనా భయం ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లను కూడా ఆవహించింది. వారు దేశంలో చోటుచేసుకుంటున్న కరోనా కల్లోలానికి భయపడిపోతున్నారు. అందుకే వరుసగా ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత్ ను వీడి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేస్తున్నారు.

అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ కు విమానాలను మే 15 వరకు నిషేధించడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. భారత్ లో కరోనా మే 15 వరకు ఉధృతం అవుతుందని.. రోజుకు 10 లక్షల కేసులు నమోదై పరిస్థితులు చేయిదాటిపోతాయన్న నిపుణుల హెచ్చరికలతో ఇక తమ దేశం పోలేమన్న భయం క్రికెటర్లను వెంటాడుతోంది.

ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఆండ్రు టై సహా కొంత మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి వైదొలిగారు. తాజాగా ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ లు వ్యక్తిగత కారణాలంటూ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక వారికి తమ పూర్తి సహకారం అందిస్తామని ఆర్సీబీ కూడా వీడ్కోలు పలికింది.

ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లంతా భయాందోళనలు వ్యక్తం చేయడం.. విమానాల రద్దుతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు.. ముంబై తరుఫున ఆడుతున్న క్రిస్ లిన్ సైతం ప్రత్యేక చార్టెడ్ విమానం ఏర్పాటు చేసి తమను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాలని ఆదేశ ప్రధానిని కోరాడు.

అయితే మీరు పోయిందని ఆస్ట్రేలియా అధికార టూర్ కాదని.. మీరే ప్రయాణ ఏర్పాట్లు చూసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని చెప్పారు. దీంతో ఆస్ట్రేలియన్లలో భయం ఆవహించింది.

ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే బీసీసీఐ స్పందించింది. టోర్నీ ముగిశాక కూడా మిమ్మల్ని సేఫ్ గా మీ దేశంలో దిగబెట్టే వరకు బీసీసీఐ చూసుకుంటుందని.. విమాన ప్రయాణం నుంచి మీ దేశంలోని ఇంటివరకు చేర్చే బాధ్యత మాది అని బీసీసీఐ అధికారికంగా విదేశీ ఆటగాళ్లకు లేఖ రాసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. మరి ఎంత మంది ఉంటారు? ఎంత మంది వైదొలుగుతారన్నది వేచిచూడాలి.