https://oktelugu.com/

Virat Kohli: ఒకే దెబ్బకు కోహ్లి ఐదు రికార్డులు.. రాహుల్ ద్రవిడ్ వెనక్కు

Virat Kohli: పాకిస్తాన్ పై గెలుపుతో విరాట్ కోహ్లి తన సత్తా చాటాడు. విమర్శకుల నోటికి తాళం వేశారు. మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పారు. పాక్ పై చిరస్మరణీయమైన విజయంతో తనలో ఇంకా సత్తా దాగి ఉందని నిరూపించాడు. ఇన్నాళ్లు విరాట్ పని అయిపోయిందని చేస్తున్న సమయంలో తన బ్యాట్ ఝళిపించి ప్రత్యర్తికి చుక్కలు చూపించాడు. ఓటమి బారి నుంచి రక్షించాడు. ఒంటిచేత్తో పోరాటం చేసి ఇండియాకు మరో విజయాన్ని అందించారు. దీంతో విరాట్ కోహ్లి […]

Written By:
  • Srinivas
  • , Updated On : October 25, 2022 / 09:34 AM IST
    Follow us on

    Virat Kohli: పాకిస్తాన్ పై గెలుపుతో విరాట్ కోహ్లి తన సత్తా చాటాడు. విమర్శకుల నోటికి తాళం వేశారు. మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పారు. పాక్ పై చిరస్మరణీయమైన విజయంతో తనలో ఇంకా సత్తా దాగి ఉందని నిరూపించాడు. ఇన్నాళ్లు విరాట్ పని అయిపోయిందని చేస్తున్న సమయంలో తన బ్యాట్ ఝళిపించి ప్రత్యర్తికి చుక్కలు చూపించాడు. ఓటమి బారి నుంచి రక్షించాడు. ఒంటిచేత్తో పోరాటం చేసి ఇండియాకు మరో విజయాన్ని అందించారు. దీంతో విరాట్ కోహ్లి ప్రదర్శనకు అందరు ఫిదా అయ్యారు. విరాట్ పై ప్రశంసల వర్షం కురిసింది. విరాట్ ఫామ్ లోకి రావడంతో టీమిండియాకు ప్లస్ కానుంది.

    Virat Kohli

    కోహ్లి ఈ మ్యాచ్ తో కొన్ని రికార్డులు బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్ లో చేసిన అర్థ శతకంతో మొత్తం 24 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐసీసీలో అత్యధిక అర్థ శతకాలు చేసిన రికార్డు ఇదివరకు సచిన్ పేరిట (23) ఉండేది. దీంతో విరాట్ ఆ రికార్డును బ్రేక్ చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నాళ్లు రోహిత్ శర్మ పేరిట అత్యధిక పరుగులు (143 మ్యాచ్ ల్లో 3741) రికార్డును 110 ఇన్నింగ్స్ ల్లోనే కోహ్లి (3794 పరుగులు) చేసి రిహిత్ రికార్డును కూడా దాటడం విశేషం.

    టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న క్రీడాకారుడిగా కూడా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ రికార్డును కూడా దాటేశాడు. ద్రవిడ్ 509 ఇన్నింగ్స్ లో 24,208 పరుగులు చేయగా 528 మ్యాచుల్లో 24,212 పరుగులు 71 సెంచరీలు, 126 హాఫ్ సెంచరీలు చేసి సంచలనం సృష్టించాడు. సచిన్ 34,357, కుమార సంగర్కర 28,016, రికీ పాంటింగ్ 27,483, మహేల జయవర్దనే 25,957, జాక్ 25,534 ఐదు స్థానాల్లో ఉన్నారు.

    Virat Kohli

    విరాట్ కోహ్లి బ్యాట్ తో విజృంభించడంతో పలు రికార్డులు తిరగరాని తనకు ఎదురు లేదని చాటి చెప్పారు. ఇన్నాళ్లు విరాట్ పై వచ్చిన విమర్శలకు సరైన సమయంలో జవాబు చెప్పారు. తనలో ఇంకా పరుగుల దాహం తీరలేదని మరోసారి నిరూపించుకున్నాడు. అరుదైన రికార్డులు అందుకుంటూ తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. పాకిస్తాన్ పై సాధించిన విజయం అందరిలో ఎంతో స్ఫూర్తి నింపింది. దీపావళి కానుకగా భారతీయులకు ఇండియా విజయం సంతోషాన్ని కలిగించింది.

    Tags