PV Sindhu: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. పతకాల వేటలో దూసుకుపోతోంది. గతంలో లాగానే తన స్థానాన్ని మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళ్తోంది. కింది స్థానంలో ఉన్న ఇండియా రోజురోజుకు ఎగబాకుతూ నాలుగో స్థానానికి చేరుకోవడం గమనార్హం. మూడో స్థానం దక్కించుకోవాలంటే ఇంకా ఏడు స్వర్ణాలు గెలవాల్సి ఉంటుంది. నాలుగో స్థానంలో ఉన్న న్యూజీలాండ్ ను కిందకు నెట్టి ఆ స్థానాన్ని ఇండియా కైవసం చేసుకోవడం తెలిసిందే. దీంతో గతంలోలాగానే ఈ సారి కూడా మన క్రీడాకారులు అదరగొడుతున్నారు.
మన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం గెలుచుకోవడంతో భారత్ ర్యాంకు మెరుగుపడింది. ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన పీవీసింధుపై భారీగానే ఆశలు పెట్టుకోవడంతో ఆమె స్వర్ణం గెలుచుకోవడంతో మన కలలు నెరవేరాయి. పతకాల పట్టికలో ఎంతో ఎత్తుకు ఎదుగుతోంది. రోజురోజుకు పతకాలను పడుతూ తన స్థానాన్ని మీదికి తీసుకొచ్చింది. ఇవాళ ఆఖరు కావడంతో ఇండియా ఏ స్థానం దక్కించుకుంటుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇండియా ఇంతవరకు 17 స్వర్ణాలు తన ఖాతాలో వేసుకుంది. మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేయడంతో మన స్థానం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరడం తెలిసిందే.
Also Read: MP Gorantla Madhav Controversy: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో వివాదంలో ఊహించని ట్విస్ట్..
భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ఫైనల్ కు చేరడం గమనార్హం. కామన్వెల్త్ క్రీడల్లో మన క్రీడాకారుల ప్రతిభతో భారత్ పతకాల వేటలో ముందంజలో వెళ్తోంది. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెట్ రంగాల్లో మన వారు మొత్తం 48 పతకాలు సాధించి పతకాల పట్టికలో పాయింట్లు పెంచుకుంటూ నాలుగో స్థానానికి చేరింది. మూడో స్థానం చేరాలంటే ఇంకా ఏడు స్వర్ణాలు కావాల్సి ఉండటంతో అవి సాధిస్తే మనం మూడో స్థానంలోకి వెళ్లడం ఖాయమే. కానీ సమయం లేకపోవడంతో ఆ కోరిక తీరుతుందో లేదో తెలియడం లేదు.
ఇవాళ చివరి రోజు కావడంతో ఇంకా ఎన్ని పతకాలు వస్తాయో చూడాల్సిందే. కామన్వెల్త్ క్రీడల్లో మన సత్తా చాటుతోంది. పాల్గొన్న ఈవెంట్లలో రాణిస్తూ తన హవా కొనసాగిస్తోంది. దీంతో ఈ కామన్వెల్త్ లో మన స్థానం నాలుగుకే పరిమితమవుతుందో ఇంకో పాయింట్ ఎగబాకుతుందో మన క్రీడాకారుల మీదే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో మన క్రీడాకారుల భవితవ్యం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. ఇంకా కొన్ని ఈవెంట్లలో పతకాలు రావాల్సి ఉంది. దీంతో మన స్థానం మెరుగవుతుందో ఏమో చూడాల్సిందే మరి.
Also Read: Ramji Gond: రాంజీ గోండు.. స్వాతంత్ర్య పోరాటంలో తెలంగాణ అగ్గి బరాట