Cheteshwar Pujara Retirement: రాహుల్ ద్రావిడ్ ఆట చూడని వారికి.. అతడు తన ఆటతో సమ్మోహితులను చేశాడు. భయంకరమైన ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. వారి గడ్డమీద డిఫెన్స్ ఆడితే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఎలాంటి బంతులు వేసిన సరే అడ్డుగోడ మాదిరిగా నిలబడి అదరగొట్టాడు. టీమ్ ఇండియాను ఊరిస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందించాడు. అంతేకాదు టెస్టులలో పరిణితి తో బ్యాటింగ్ ఎలా చేయాలో నిరూపించాడు. అందువల్లే అతడిని ఈ కాలపు భారతదేశపు గోడ అని అభిమానులు పిలవడం మొదలుపెట్టారు.. అయితే అటువంటి ఆటగాడు ఇప్పుడు క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు.
Also Read: ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు.. చివరకు 13 ఏళ్ల బాలికను కూడా వదలలేదు!
కొంతకాలంగా గాయాలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న పూజార క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు శాశ్వత వీడ్కోలు పలికాడు.. భారత జెర్సీ ధరించడం.. జాతీయ జెండా ఎత్తుకోవడం.. జాతీయగీతం పాడటం.. మైదానంలో అడుగుపెట్టిన ప్రతి సందర్భంలో శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నించడం గొప్ప విషయమని పూజార వ్యాఖ్యానించాడు. తనకు ఈ స్థాయిలో అవకాశాలు కల్పించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి, సౌరాష్ట్ర క్రికెట్, ఇతర యాజమాన్యాలకు ధన్యవాదాలు అని పూజార పేర్కొన్నాడు.. పూజార టెస్ట్ క్రికెట్లో అత్యున్నతమైన ప్రమాణాలు నెలకొల్పాడు.. జూనియర్ రాహుల్ ద్రావిడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సిరీస్ లలో అతడు అదరగొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ బ్యాటింగ్ చేసేవాడు. ఇటీవలి బోర్డర్ గవాస్కర్ సిరీస్లో పూజారా లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. సోషల్ మీడియాలో అయితే పూజారాను జట్టులోకి తీసుకోవాలి అనే ఉద్యమం నడిచిందంటే అతడి స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. పూజార భారత జట్టు తరుపున 13 టెస్టులు ఆడాడు. ఏకంగా 7195 పరుగులు చేశాడు. ఇక వన్డేలలో ఐదు మ్యాచ్లు మాత్రమే 51 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మేట్ లో ఇతడి అత్యధిక స్కోరు 206* పరుగులు.
ఆస్ట్రేలియా గడ్డమీద భారత జట్టు బోర్డర్ గవాస్కర్ సిరీస్ గెలుచుకుంది అంటే దానికి ప్రధాన కారణం పూజారనే. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించడం మాత్రమే కాదు.. సహనంతో ఎలా ఆడాలో కూడా నిరూపించాడు. భారీ అంచనాలున్న ఆటగాళ్ల విఫలమవుతున్న సమయంలో పూజార మాత్రం సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు.. తనకు మాత్రమే సాధ్యమైన డిఫెన్స్ ఆడుతూ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. అందువల్లే అతడిని ఈ కాలపు దృఢమైన గోడ అని పిలుస్తుంటారు. కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న పూజార.. ఇటీవల వ్యాఖ్యాత అవతారం ఎత్తాడు. జాతీయ జట్టులో చోటు లభించే అవకాశం లేకపోవడంతో ఇక ఎదురు చూసి కూడా ఉపయోగం లేదని భావించి రిటైర్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పుజారా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు శాశ్వత వీడ్కోలు పలకడం పట్ల అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అద్భుతమైన ఆటగాడు ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం బాగోలేదని వ్యాఖ్యానిస్తున్నారు.