Homeక్రీడలుక్రికెట్‌Chennai Super Kings: చెన్నై జట్టుకు మరో హంస పాదు.. కీలక ఆటగాడికి గాయం.. ఐపీఎల్...

Chennai Super Kings: చెన్నై జట్టుకు మరో హంస పాదు.. కీలక ఆటగాడికి గాయం.. ఐపీఎల్ నుంచి ఔట్

Chennai Super Kings: ఆదిలోనే హంసపాదు అని సామెత చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా. ఐపీఎల్ లో చెన్నై జట్టుకు అది అనుభవంలోకి వస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రస్థానం ప్రస్తుతం పడుతూ లేస్తూ సాగుతోంది. రెండు విజయాలు సాధించిన ఆ జట్టు.. అంతకుమించిన స్థాయిలో అపజయాలను ఎదుర్కొంది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఆట తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చెన్నై జట్టు బ్యాటింగ్ ఈ సీజన్లో సరిగా లేదు. కెప్టెన్ సరిగ్గా ఆడటం లేదు. ఓపెనర్ సంజు తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడం లేదు. సెంచరీ చేసినప్పటికీ.. ఆ తర్వాత అతడు ఆ జోరు కొనసాగించలేకపోతున్నాడు. అతడు సరిగ్గా ఆడ లేకపోవడం వల్ల ఆ ప్రభావం జట్టు మీద తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు బ్యాటింగ్ భారాన్ని మొత్తం ఆయుష్ మాత్రే మోస్తున్నాడు.. స్థిరంగా బ్యాటింగ్ చేస్తూ చెన్నై జట్టు ఒక మోస్తరు స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.

ఇటీవల ఆయుష్ గాయపడ్డాడు. తొడ కండరాలు గట్టిగా పట్టేయడంతో నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు తదుపరి మ్యాచ్ లు ఆడేది అనుమానమేనని అందరూ అనుకున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే అతడి ఆరోగ్య పరిస్థితి ఉంది. స్కానింగ్లో తొడ కండరాలు తీవ్రంగా పట్టేసినట్టు.. అంతర్గతంగా గాయం కూడా అయినట్టు తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు అతడు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోని ఆయుష్ తదుపరి మ్యాచులు ఆడబోడని చెన్నై మేనేజ్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహక కమిటీ దృష్టికి తీసుకెళ్లింది.

ఆయుష్ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ ను తీసుకుంటుందని తెలుస్తోంది.. ఎందుకంటే చెన్నై జట్టు తదుపరి మ్యాచ్ ముంబైతో ఆడుతుంది. ఐపీఎల్ లో చెన్నై, ముంబై చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి. చెన్నై జట్టులోకి ధోని ప్రవేశిస్తాడని.. ముంబై జట్టుతో తలపడే మ్యాచ్లో ఆడదాని చెన్నై అభిమానులు చెబుతున్నారు.. ” ధోని జట్టులోకి వస్తాడు. అతడి రాక కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. అతడు గొప్పగా ఆడితే మా జట్టుకు ఐపీఎల్ లో తిరుగు ఉండదు. ఇప్పుడు మేము అదే కోరుకుంటున్నాం. ఆయుష్ గాయపడడం ఇబ్బందిగానే ఉంది. కాకపోతే జాన్సన్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడని భావిస్తున్నామని” చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular