Champions Trophy 2025: మరికొద్ది గంటల్లో పాకిస్తాన్ వేదికగా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions trophy) ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ – న్యూజిలాండ్ (PAK vs NZ) తలపడనున్నాయి. ఇటీవల ట్రై సిరీస్లో పాకిస్తాన్ పై వరుసగా రెండు మ్యాచ్లలో న్యూజిలాండ్ గెలిచింది. దెబ్బతిన్న బెబ్బులి లాగా పాకిస్తాన్ ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోటీ ఆసక్తికరం కానుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా జట్టుకు సంబంధించిన అనేక విషయాలను అతడు పంచుకున్నాడు. ఐసీసీ నిర్వహించే టూర్నీలలో తమ జట్టు అంచనాలు లేకుండా బరిలోకి దిగుతుందని.. అదే మా విజయ రహస్యమని రిజ్వాన్ వెల్లడించాడు. ఇప్పుడు కూడా తమకు అంత సీన్ లేదని.. అనామక జట్టు గాని గుర్తించాలని రిజ్వాన్ పేర్కొన్నాడు. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఎటువంటి అంచనాలు లేకుండానే రంగంలోకి దిగింది. ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుపై సర్పరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో విజయం సాధించింది. అన్ని విభాగాలలో పాకిస్తాన్ జట్టు అదరగొట్టింది. భారత జట్టును ఓడించింది. 1992 లోనూ పాక్ వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. ప్రపంచ కప్ గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో “ఎటువంటి అంచనాలు లేకుండానే మీరు బరిలోకి దిగడమే విజయ రహస్యమా” అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..” ఔను మీ అభిప్రాయం అదే అయితే.. మా జట్టును అనామకంగానే చూడాలి. మ్యాచ్ జరుగుతున్న రోజు అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించడమే మా లక్ష్యం. మిగతా విషయాలు ఏమైనా ఉంటే అది దేవుడి దృష్టికి వదిలేస్తాం.. మమ్మల్ని అండర్ డాగ్స్ గానే పరిగణించండి. తక్కువ అంచనా వేస్తే మాకే మంచిది. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడతాం. మరోసారి విజేతగా నిలుస్తామని” రిజ్వాన్ వ్యాఖ్యానించాడు.
వాటి మీద దృష్టి సారించాం
” మీ సొంత దేశంలో చాలా సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నీ జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నారని” మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..” మా బలహీనతలు ఎలా ఉన్నాయో ప్రధానంగా దృష్టి సారించాం. మాస్ అవగాహన తీరును పూర్తిగా మార్చుకున్నాం.. పాకిస్తాన్ గతంలో గొప్ప విజయాలు సాధించింది. క్రికెట్ ప్రపంచానికి మేము అసాధారణ ఆటగాళ్ళను పరిచయం చేసాం. యువ ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో ఉన్నారు. వారు కూడా రోజు కష్టపడి మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి గెలుచుకోవడానికి మేము సమర్థవంతంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం.. స్మార్ట్ క్రికెట్ ఆడితే ఫలితాన్ని ఆ దేవుడే మాకు తిరిగి ఇస్తాడు.. గత పది సంవత్సరాలలో ఈ ఒక్క జట్టు కూడా మా దేశంలో పర్యటించకపోయినప్పటికీ.. మేము మాత్రం అద్భుతమైన విజయాలు సాధించాం. కాబట్టి మా నైపుణ్యం పై, సామర్ధ్యం పై ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా పూర్తి సామర్థ్యాన్ని మేము కచ్చితంగా ప్రదర్శిస్తాం. ఇతర జట్లు విఫలం కావచ్చు. కానీ మా తప్పిదాలను సరిదిద్దుకోవడానికి.. మా జట్టుకు అద్భుతమైన విజయాలు అందించడానికి సమష్టిగా మేం కృషి చేస్తామని” మహమ్మద్ రిజ్వాన్ వ్యాఖ్యానించాడు.