Yuzvendra Chahal: రాజస్తాన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. దాదాపు చావు అంచులకు వెళ్లొచ్చాడు. దీంతో ప్రాణభయంతో కొద్ది సేపు అతడి నోటి వెంట మాట రాలేదు. 2013లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని తన బాధ వెళ్లగక్కాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోపై అభిమానులతో తన అనుభవాలు పంచుకున్నాడు. తాగిన మైకంలో తోటి క్రికెటర్ చేసిన దురాగాతానికి చాహల్ బాధ్యుడు కావడం గమనార్హం.
2013లో ముంబయి తరఫున ఆడినప్పుడు బెంగుళూరులో మ్యాచ్ లో విజయం సాధించడంతో అక్కడ పార్టీ చేసుకున్నారు. అక్కడ పీకల దాకా తాగిన ఓ క్రికెటర్ చాహల్ ను దగ్గరకు రమ్మని పిలిచాడు. దీంతో చాహల్ అతడి వద్దకు వెళ్లాడు. దీంతో అతడు చాహల్ ను ఎత్తుకుని బాల్కనీ లోని 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశాడు. భయంతో అతడి భుజాలను చేతులతో గట్టిగా పట్టుకోవడంతో చావునుంచి తప్పించుకున్నాడు. లేదంటే అక్కడి నుంచి పడితే అంతే సంగతి.
అక్కడున్న వారు కూడా త్వరగా స్పందించడంతో బతికి బట్ట కట్టినట్లు చెప్పుకున్నాడు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఆనాటి ప్రమాదంపై గుర్తు చేసుకుని చాహల్ భయాందోళన చెందుతున్నాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకున్నాడు. ప్రాణభయంతో చలించిపోతున్నాడు. ఆనాటి సంగతి గుర్తు చేసుకుంటేనే కంగారు పుడుతుందని చెబుతున్నాడు.
ఆ క్రికెటర్ ఎవరో చెప్పడం లేదు. నెటిజన్లు మాత్రం అతడి పేరు చెప్పాలని కోరుతున్నారు. 2013లో ముంబయి తరఫున ఆడిన చాహల్ తరువాత బెంగుళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్ లో మాత్రం రాజస్తాన్ తరఫున ఆడుతున్నాడు. తాగిన మైకంలో ఆ క్రికెటర్ చేసిన దానికి తన జీవితంలో కూడా మరిచిపోలేకపోతున్నాడు. తనకు ప్రాణం పోయినంత పని అయిందని చెబుతున్నాడు. కానీ అతడి పేరు మాత్రం బయటపెట్టడం లేదు.