https://oktelugu.com/

Suryakumar Yadav: ఈ ఆల్ రౌండర్ కి తీవ్ర అన్యాయం చేస్తున్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్…ఫైర్ అవుతున్న అభిమానులు…

రెండో మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు... ఇక ఇదే టైం లో టీమ్ లో ఉన్న ప్లేయర్లు కూడా 2024 జూన్ లో జరిగే టి 20 వరల్డ్ కప్ ని దృష్టి లో పెట్టుకొని వాళ్ల శక్తి , సామర్థ్యాల మేరకు అద్భుతమైన ప్రదర్శన కనబర్చుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2023 / 02:02 PM IST

    Suryakumar Yadav

    Follow us on

    Suryakumar Yadav: ఇండియన్ టీం ప్రస్తుతం మంచి ఫామ్ ని కనబరుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ టీం లో ఉన్న ప్లేయర్లు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ ఓడిపోయినప్పటికీ ఇండియన్ టీం వరుసగా టి20 సిరీస్ లను ఆడుతుంది. కుర్ర ప్లేయర్లు తమ దైన రీతిలో అద్భుతాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా మీద ఒక సీరీస్ ని గెలిచి ఆ తర్వాత ఇప్పుడు సౌతాఫ్రికా మీద తన ఆధిపత్యాన్ని చూపించడానికి ఇండియన్ టీమ్ ముందుకు కదులుతుంది. ఇక అందులో భాగంగా నిన్న ఆడాల్సిన మొదటి మ్యాచ్ రద్దు అయింది…

    ఇక రెండో మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు… ఇక ఇదే టైం లో టీమ్ లో ఉన్న ప్లేయర్లు కూడా 2024 జూన్ లో జరిగే టి 20 వరల్డ్ కప్ ని దృష్టి లో పెట్టుకొని వాళ్ల శక్తి , సామర్థ్యాల మేరకు అద్భుతమైన ప్రదర్శన కనబర్చుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం తరుపున తనదైన రీతిలో మ్యాచులు ఆడడానికి ప్లేయర్లు తమ వంతు కృషి అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే టైంలో ఇండియన్ టీం లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా మంచి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మొన్న ఆస్ట్రేలియా మీద జరిగిన టి20 సిరీస్ లో వాషింగ్ టన్ సుందర్ ని సెలెక్ట్ చేసినప్పటికీ ఆయన్ని బెంచ్ పైన కూర్చోబెట్టారు.

    ఐదు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో కూడా ఆయన్ని ఆడనివ్వలేదు. మరి ఈ సిరీస్ లో అయిన అతనికి అవకాశం ఇస్తారా లేదా బెంచ్ పైనే కూర్చోబెడతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఒక మ్యాచ్ రద్దయింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ ల్లో కనీసం ఒక్క మ్యాచ్ లో అయిన తీసుకుంటారా లేదా అనే విషయం మీద చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా మీద జరిగిన ఐదు మ్యాచ్ లా సిరీస్ లోనే అతనికి చోటు కల్పించలేదు అంటే ఇక రెండు మ్యాచులు మాత్రమే ఉన్న సౌతాఫ్రికా టీమ్ లో చోటు ఎంత మేరకు కల్పిస్తారు అనేది ఇక్కడ తెలియాల్సిన విషయం.

    ఇక టి20 వరల్డ్ కప్ కోసం అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉంటే తను మాత్రం టీమ్ లో ఉండకపోవడం అనేది సుందర్ కి అవమానమనే చెప్పాలి. తనకు కూడా అవకాశం వస్తే తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ఆసక్తితో ఉన్నాడు. అలాంటి వారిని కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా ఎందుకు తీసుకోవడం లేదు అంటూ ఇండియన్ సీనియర్ ప్లేయర్లు సైతం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పైన, కోచ్ రాహుల్ ద్రావిడ్ పైన తీవ్ర స్థాయి లో విరుచుకు పడుతున్నారు. ఎందుకంటే వరల్డ్ కప్ వస్తున్న నేపద్యంలో తన టాలెంట్ తను ప్రూవ్ చేసుకుంటేనే తను వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవుతాడు అంతే తప్ప లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది…