RCB Vs GT
RCB Vs GT: నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో బెంగళూరు గెలిచి చూపించింది. ప్లే ఆఫ్ ఆశలను బలంగా నిలుపుకుంది.. శనివారం రాత్రి బెంగళూరు వేదికగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో ఏడవ స్థానానికి చేరుకుంది .. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 147 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. గుజరాత్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్( 37 ) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో యశ్ దయాల్, విజయ్ కుమార్ వైశాఖ్, మహమ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ లక్ష్యాన్ని బెంగళూరు 13.4 ఓవర్లలో, ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది.. బెంగళూరు కెప్టెన్ డూప్లెసిస్ 64, విరాట్ కోహ్లీ 42 పరుగులు చేసి బెంగళూరు విజయానికి బాటలు వేశారు.. గుజరాత్ బౌలర్లలో లిటిల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ చేసిన ఫీల్డింగ్ అభిమానులను అలరించింది. గుజరాత్ జట్టు ఆశలపై నీళ్లు చెల్లింది.. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జట్టుకు దారుణమైన ఆరంభం లభించింది. సిరాజ్ బౌలింగ్ దెబ్బకు వృద్ది మాన్ సాహా(1), గిల్(2) పెవిలియన్ చేరుకున్నారు. ఇతర బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ పవర్ ప్లే లో మూడు వికెట్ల కోల్పోయి 23 రన్స్ మాత్రమే చేసింది. ఈ దశలో గుజరాత్ ను షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. మిల్లర్ ను కర్ణ్ శర్మ 12 ఓవర్లో వెనక్కి పంపించాడు.. మరో ఎండ్ లో షారుక్ ఖాన్ ఉండడంతో గుజరాత్ బలమైన నమ్మకంతోనే ఉంది. అయితే ఆ మరుసటి ఓవర్లో గుజరాత్ జట్టుకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది.
కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ తో షారుక్ ఖాన్ పెవిలియన్ చేరుకోక తప్పలేదు. విజయ్ కుమార్ వేసిన బంతిని రాహుల్ తేవాటియా ఆఫ్ సైడ్ లో ఆడాడు. దీంతో షారుక్ ఖాన్ సింగిల్ కోసం ముందుకు వచ్చాడు. దానికి రాహుల్ నిరాకరించాడు. దీంతో షారుక్ వెనక్కి వెళ్లక తప్పలేదు. వేగంగా వెళ్లకుండా, బద్ధకాన్ని ప్రదర్శించాడు. దీంతో కోహ్లీ మెరుపు వేగంతో బంతిని విసిరాడు. ఫలితంగా అది వికెట్లను గిరాటేసింది. షారుక్ ఖాన్ అవుట్ కావడంతో గుజరాత్ ఆశలు వదిలేసుకుంది. అప్పటికే 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు మాత్రమే చేసింది. ఇక అప్పటినుంచి ఏ దశలోనూ గుజరాత్ జట్టు కోలుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ విసిరిన త్రో కు షారుక్ ఖాన్ అవుట్ కావడంతో.. బెంగళూరు ఆటగాడు గ్రీన్ ఏడుపు ముఖం పెట్టి.. వికెట్ కు అలా ఎలా త్రో విసిరావంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
, , #RCBvGT #TATAIPL #IPLonJioCinema #ViratKohli pic.twitter.com/xNhbIBu9Yw
— JioCinema (@JioCinema) May 4, 2024