India vs Pakistan : బండి బాగున్నంతవరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పరుగులు తీస్తున్నంతవరకు పెద్దగా సమస్య ఉండదు. కానీ ఒక్కసారి రిపేర్ మొదలైందా.. ఇక గతంలో మాదిరిగా వేగం ఉండదు. గత కాలంతో పోల్చినట్టుగా పరుగులు తీయదు.. ఇది కేవలం బండికి మాత్రమే కాదు.. ఆటగాళ్లకు కూడా వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా క్రికెటర్లకు మరింత ఎక్కువగా వర్తిస్తుంది.
Jasprit Bumrah hasn’t quite been at his best!#AsiaCup2025 #INDvsPAK pic.twitter.com/u29vRkK09c
— CRICKETNMORE (@cricketnmore) September 21, 2025
సమకాలీన క్రికెట్లో బుమ్రా అద్భుతమైన బౌలర్. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అత్యంత పొదుపుగా బంతులు వేస్తుంటాడు. వికెట్లు కూడా అదే స్థాయిలో తీస్తుంటాడు. జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో ఏ కెప్టెన్ అయినా సరే చూసేది బుమ్రా వైపే. తారాజువ్వలాగా వచ్చిన అతడు తిరుగులేని స్థాయిలో ప్రదర్శన చేశాడు. అద్భుతమైన బంతులు వేసి వికెట్లు సాధించాడు. తద్వారా తనకంటూ ఒక గుర్తింపును సాధించాడు. అయితే అటువంటి ఆటగాడు ఇప్పుడు తేలిపోతున్నాడు. ముఖ్యంగా సత్తా చూపించాల్సిన చోట చేతులెత్తేస్తున్నాడు. అనామక బౌలర్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు.
బుమ్రా కు గతంలో వెన్నెముకకు సర్జరీ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో నొప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టడంతో అతడు నేషనల్ క్రికెట్ అకాడమీకి పరిమితం కావలసి వచ్చింది. వర్క్ లోడ్ వల్ల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంచారు. ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడుతున్న బుమ్రా.. తన స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వికెట్లు తీయలేకపోయాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా.. మూడు ఓవర్లు వేసి.. ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు. నో బాల్, వైడ్ బాల్స్ వేసి అనామక ఆటతీరును ప్రదర్శించాడు. అతని బౌలింగ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం విశేషం. అతడు బౌలింగ్ చేస్తుంటే పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ప్రకారం అతడు టి20కి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే అతని బౌలింగ్లో వాడి కనిపించడం లేదని.. వేడి తగ్గిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
Fakhar Zaman Punched To Bhumra #PAKvIND | #Cricket | #Pakistan | #RashidLatif | #SalmanAliAgha | #AsiaCup2025 | #Dubai pic.twitter.com/p4XfifwGpu
— IKRAMIC (@IkramicOfficial) September 21, 2025