India Vs England: ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బౌలర్లలో బుమ్రా ముందు వరుసలో ఉంటారు. రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లను అతడు ఎలా వణికించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బుమ్రా.. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ ను ఔట్ చేసిన విధానం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారుతున్నది. ఇదే క్రమంలో భారత పర్యటనలో రూట్ పేలవ ప్రదర్శన పై చర్చ జరుగుతోంది.
తొలి ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు తొలి సెషన్ లోనే కోలుకోవాలని దెబ్బ తగిలింది. ఇన్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా వేసిన బంతిని ఇంగ్లాండ్ బ్యాటర్ రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ బంతి బ్యాట్ అంచుకు తగిలి స్లిప్ లో ఉన్న యశస్వి జైస్వాల్ చేతుల్లో పడింది. దీంతో జో రూట్ నిరాశతో వెనుదిరిగాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన 40 వ ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని బుమ్రా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. అయితే ముందుగానే బంతిని అంచనా వేసినట్టు కనిపించిన రూట్ రివర్స్ స్వీప్ షాట్ ఆడే పొజిషన్ కు వచ్చాడు. అయితే బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో ఆ బంతి రూట్ బ్యాట్ కు తగిలి సెకండ్ స్లిప్ లో ఉన్న యశస్వి జైస్వాల్ వైపు వేగంగా దూసుకెళ్ళగా.. అతడు కూడా అంతే వేగంగా ఆ బంతిని అందుకున్నాడు. దీంతో జో రూట్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
జో రూట్ కొట్టిన బంతిని ఎంతో చాకచక్యంగా జై శ్వాల్ క్యాచ్ పట్టడంతో ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జో రూట్ ను ఔటు చేయడం బుమ్రాకు ఇది తొమ్మిదవ సారి. ఇండియా టూర్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న జో రూట్ పై అభిమానులు, ఇంగ్లాండ్ మాజీ క్రీడాకారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ” పదునైన బంతులు వేసే బుమ్రా బౌలింగ్లో రివర్స్ షాట్ ఆడటం అవసరమా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడో రోజు తొలి ఇన్నింగ్స్ 207/2 పరుగులతో ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు.. మరో మూడు వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. డక్కెట్ 153 పరుగులు చేసి కుల దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. జో రూట్ ను బుమ్రా బోల్తా కొట్టించాడు. బేయిర్ స్టో పరుగులు ఏమీ చేయకుండానే కుల దీప్ యాదవ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ 39, ఫోక్స్ 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
JAISWAL WITH A STUNNER AT SLIP…!!! pic.twitter.com/nCQlQ9RoZu
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 17, 2024