Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా ఇప్పటికే 5 మ్యాచ్ లను ఆడితే అందులో 5 మ్యాచ్ లో విజయం సాధించి రికార్డును నెలకొల్పింది.ఇక ఈ క్రమంలోనే ఇండియన్ టీం కి ఎనలేని సేవలు అందిస్తూ ఆల్ రౌండర్ గా తనదైన ప్రతిభ ని చూపిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కీలకమైన సమయంలో ఎక్కువ పరుగులు చేస్తూ టీమ్ కి ఎక్కువ స్కోర్అందించగల భారీ హిట్టర్ గా పేరు పొందిన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అయిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయాల బారినపడి టీమ్ కి దూరమైన విషయం మనకు తెలిసిందే…
ఈయన రీసెంట్ గా న్యూజిలాండ్ తో ఇండియా ఆడిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ కి దూరమయ్యాడు. ఇక ఆ మ్యాచ్ కి హార్థిక్ పాండ్యా ప్లేస్ లో టీం లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ తనదైన ప్రతిభను చూపించకుండా వరుస ఫెలవమైన పర్ఫామెన్స్ లను కంటిన్యూ చేస్తూ ఈ మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా నెక్స్ట్ జరగబోయే ఇంగ్లాండ్ మ్యాచ్ కైనా అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయం మీద కీలకమైన చర్చలు జరుగుతున్నాయి ఇక ఇప్పటికే హార్దిక్ పాండ్యా చీల మండ గాయంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. బెంగళూరులోని ఎన్ సీ ఏ లో నితిన్ పటేల్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సమక్షంలో ట్రీట్మెంట్ అందుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన గాయం ముందు ఉన్న దానికంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉండడంతో హార్థిక్ పాండ్యా కి ఇబ్బందిగా మారినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఈయన ఇంగ్లాండ్ టీం కి జరిగే మ్యాచ్ లో అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ మ్యాచ్ జరగడానికి ఇంకొక రెండు రోజులు గ్యాప్ ఉండడంతో తన అప్పటివరకు రికవరీ అవుతాడని వైద్య బృందం అయితే స్పష్టంగా తెలియజేస్తుంది.
అయినప్పటికీ బీసీసీఐ అధికారులు మాత్రం హార్దిక్ పాండ్యా నెక్స్ట్ జరగబోయే ఇంగ్లాండ్ మ్యాచ్ కి పూర్తి గా ఫిట్ గా అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దాంతో ఈ మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా అందుబాటు లో ఉంటాడా లేదా అనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ప్లేస్ లో మళ్లీ సూర్యకుమార్ యాదవ్ ని తీసుకుంటారా లేదా మరో ఆల్ రౌండర్ ని ఎవరినైనా తీసుకుంటారా అనే విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది…