Champions Trophy 2025: పాకిస్తాన్ తో ఉన్న విభేదాలు నేపథ్యంలో టీమిండియా అక్కడికి వెళ్లడానికి నిరాకరిస్తోంది. ఇప్పటికే అనేక సందర్భాలలో భారత క్రికెట్ కౌన్సిల్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. ఐసీసీకి మెయిల్ కూడా చేసింది.” పాకిస్తాన్ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే మేము అక్కడికి వెళ్లలేము. ఆ దేశంతో మాకు దౌత్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇతర రకాల సమస్యలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని కాదని మేము మా ఆటగాళ్లను అక్కడికి పంపించలేం. మాకంటూ కొన్ని విధానాలున్నాయి. వాటిని అధిగమించి పాకిస్తాన్ కు వెళ్లలేం. ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్ లో నిర్వహించాలనుకుంటే.. మా ఆటగాళ్లు ఆడే మ్యాచ్ లను హైబ్రిడ్ విధానంలో ఆడించాలని” ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది.
సౌత్ ఆఫ్రికాలో టోర్నీ..
ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో నిర్వహిస్తే అక్కడ ఆడేందుకు తాము నిరాకరిస్తామని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఇదే విషయాన్ని బిసిసిఐ పాకిస్థాన్ కు వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ కూడా ఘాటుగానే స్పందించింది. భారత క్రికెట్ యాజమాన్యం ఐ సి సి ని తోలుబొమ్మలాగా ఆడిస్తోందని మండిపడింది. భారత వ్యవహార శైలి వల్ల తమకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని ఆక్షేపించింది. అయితే ఇప్పుడు ఈ టోర్నీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ ఆఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ జట్టుకున్నాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం వచ్చేయడాది ఫిబ్రవరిలో ఈ టోర్నీ పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ కూడా పాకిస్తాన్ జట్టు యాజమాన్యం రూపొందించింది. దానిని ఐసిసికి పంపించింది. టోర్నీని ఘనంగా నిర్వహించాలని తమ దేశంలో ఉన్న క్రీడామైదానాలను ఆధునికీకరించే పనిలో పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ నిమగ్నమైంది. అయితే ఈ టోర్నీలో తాము ఆడే మ్యాచ్లు మొత్తం తటస్థ వేదికలపై నిర్వహించాలని భారత జట్టు మొదటినుంచి ఐసీసీని కోరుతోంది. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్థాన్లో తాము ఆడలేమని.. హైబ్రిడ్ మోడల్ విధానంలో టోర్నీ నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. ఇక కేంద్రం కూడా భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించడానికి ఒప్పుకోవడం లేదు. ఇక పాకిస్తాన్ కూడా హైబ్రిడ్ మోడల్ లో ఈ టోర్నీ జరపడానికి ఆసక్తిని ప్రదర్శించడం లేదు. అవసరమైతే ఈ టోర్నీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేస్తోంది. హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించలేమని వివరిస్తున్నది. ఒకవేళ టోర్నీలో భారత్ ఆడకుంటే.. మరో జట్టుకు అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ ఐసీసీకి విన్నవించింది. ఒకవేళ తమకు వ్యతిరేకంగా ఐసిసి వ్యవహరిస్తే.. ఈ మెగా ట్రోఫీ నుంచి తప్పుకుని.. న్యాయ పోరాటం చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరిస్తున్నది.
అందుకే దక్షిణాఫ్రికాలో..
అటు భారత్, ఇటు పాకిస్తాన్ మొండి పట్టుదలకు పోతున్న నేపథ్యంలో టోర్నీ విషయంలో ఐసీసీ తలలు పట్టుకున్నది. అయితే తాజా సమాచారం ప్రకారం ఛాంపియన్ ట్రోఫీని ఐసిసి దక్షిణాఫ్రికాలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్ లో పాకిస్తాన్ టోర్నీ నిర్వహించకపోతే.. సౌత్ ఆఫ్రికా వేదికగా నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ లేకుండా నిర్వహిస్తే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుందని ఐసిసి స్పష్టం చేసింది. క్రికెట్లో అత్యంత సంపన్నమైన బోర్డుగా బీసీసీఐ ఉందని.. దానికి వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యం తమకు లేదని ఐసిసి ఇప్పటికే పీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఐసీసీ చైర్మన్ గా జై షా వచ్చే నెల మొదటి వారంలో బాధ్యతలు స్వీకరిస్తారు. అలాంటప్పుడు భారత్ కు వ్యతిరేకంగా ఐసిసి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహించకపోతే.. మరింత ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Big shock for pakistan champions trophy in south africa
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com