Bengaluru IPL 2025 : గత మూడు పర్యాయాలు ఐపిఎల్ చివరి అంచె పోటీలకు కన్నడ జట్టు వెళ్ళింది. అయితే చివరి పోటీలో ప్రత్యర్థి జట్టు ఎదుట తలవంచి అత్యంత దురదృష్టకరమైన జట్టుగా అపఖ్యాతిని సంపాదించుకుంది. అయితే నాలుగో పర్యాయం చివరి అంచె కు ఎంపిక కావడంతో కన్నడ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేవు. కన్నడ ఆటగాళ్ల ఉత్సాహానికి పరిమితి అంటూ లేదు. దీంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలని కన్నడ జట్టు, కన్నడ ఆటగాళ్లు భావిస్తున్నారు. కన్నడ ఆటగాళ్లు బలమైన ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో అయ్యర్ జట్టును ఓడించి ఫైనల్ వెళ్లిపోయారు. ట్రోఫీ అందుకోవడానికి కోటి ఆశలతో ఉన్నారు.
Also Read : అయ్యర్.. ఈ పేరే ఓ బ్రాండ్.. ఐపీఎల్ ఆడటానికి కాదు.. ఏలేయడానికి వచ్చాడు!
ఇంత ఆశావాహ దృక్పథంతో కన్నడ జట్టుకు ఒక ఆటగాడు షాక్ ఇచ్చి.. మళ్లీ అందులో నుంచి తేరుకునేలా చేసాడు. కన్నడ జట్టులో ఓపెనర్ గా సాల్ట్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో అద్భుతంగా రాణించాడు. అయితే అయ్యర్ జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్ కు అతడు దూరంగా ఉండే అవకాశం ఉందని జాతీయ న్యూస్ చానల్స్ లో కథనాలు వినిపించాయి. సాల్ట్ స్నేహితురాలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను చూడడానికి అతడు స్వదేశానికి వెళ్ళాడు. అయితే అతడు తిరిగి రావడం సాధ్యం కాదని…ఫైనల్ మ్యాచ్ ఆడటం వీలుపడదని ప్రచారం జరిగింది. అయితే బెంగళూరుకు జట్టు యాజమాన్యం కూడా దాదాపు పరోక్షంగా ఇదే విషయాన్ని అంగీకరించింది. అయితే ఇప్పుడు అతడు ఇండియాకు తిరిగివచ్చాడు. తన స్నేహితురాలు బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో చూసి.. ఐపీఎల్ ఫైనల్ ఆడేందుకు ఇండియా వచ్చేసాడు.
అతడు తిరిగి రావడంతో బెంగళూరు జట్టులో ఆనందం నెలకొంది.. ఇక కన్నడ అభిమానులైతే ఏకంగా ట్రోఫీ గెలిచినంత ఆనందంలో మునిగిపోయారు..” మా కన్నడ జట్టుకు అతడు అద్భుతమైన భాగస్వామ్యం అందిస్తున్నాడు. ఈ సీజన్లో తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు ఫైనల్ మ్యాచ్ ఆడడు అంటే మేము భయపడిపోయాం. కానీ మా భయాన్ని అతడు పటా పంచలు చేశాడు. ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వస్తున్నానని చెప్పాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. స్వదేశానికి వచ్చి ఫైనల్ మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమని సంకేతాలు పంపాడు. అతడు ఆడే ఆట కోసం ఎదురుచూస్తున్నాం. ఫైనల్ మ్యాచ్లో అతడు ఆకాశమే హద్దుగా చెలగిపోతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదని” కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
స్వదేశానికి వచ్చిన సాల్ట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కన్నడ జట్టు తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పంచుకుంది. స్టార్ ప్లేయర్ వచ్చాడని.. ఇక తమ జట్టుకు తిరుగులేదని అందులో పేర్కొంది.