Homeక్రీడలుక్రికెట్‌Ben Stokes Retirement: తాగుడు, వాగుడు.. క్రికెటర్ ను తన్ని తరిమేస్తారని తెలిసి రిటైర్మెంట్ ప్రకటించాడు

Ben Stokes Retirement: తాగుడు, వాగుడు.. క్రికెటర్ ను తన్ని తరిమేస్తారని తెలిసి రిటైర్మెంట్ ప్రకటించాడు

Ben Stokes Retirement: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఇందులో ఆడే ఆటగాళ్లు జెంటిల్మెన్ మాదిరిగానే ఉండాలి. చిల్లర విహారాలు వేస్తే ఆటకున్న విలువ పోతుంది. అటువంటి ఆటగాళ్లు ఉండకూడదు. క్రికెట్ ఆడకూడదు. ఇప్పుడు వరకు ప్రపంచ క్రికెట్లోకి చాలామంది ఆటగాళ్లు వచ్చారు… ఆ ఆటకు విలువ తీసుకొచ్చారు. కానీ కొంతమంది మాత్రం దారుణంగా ప్రవర్తించారు. వీధి రౌడీల కంటే హీనంగా వ్యవహరించారు. అటువంటివారు కెరియర్ మధ్యలోనే వెళ్లిపోయారు. కొందరైతే అనామకంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పేసారు. అందులో ఇతడికి మొదటి స్థానం ఉంటుందేమో.

క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో. అటువంటి ఇంగ్లాండు జట్టుకు చెందిన బెన్ స్టోక్స్ దాదాపు రిటైర్మెంట్ ప్రకటించినట్టే. ఇంగ్లాండ్ జట్టు సారధిగా ఇతడు ఎన్నో వివాదాలకు కారణమయ్యాడు. తాగడం.. వాగడం వంటివి ఇతడికి పరిపాటి. క్లబ్లో దూరడం.. పనికిమాలిన పనులు చేయడం.. గొడవలకు దిగడం వంటివి ఇతడికి అలవాటు. అనేక సందర్భాలలో ఇతడు అలా చేసినప్పటికీ మేనేజ్మెంట్ మాటలతోనే సరిపుచ్చింది. ఇప్పుడు ఆ మాటలు కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే ఇతడికి తాగడం అలవాటుగా మారింది. తాగిన మైకంలో గొడవలకు దిగడం పరిపాటిగా మారింది. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ పరువు పోతోంది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఇతడిని తన్ని తరిమియడానికి సిద్ధమైంది. కాకపోతే ఆ అవకాశం ఇవ్వకుండా ఇతడే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్ జట్టు తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఒక క్లబ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ విపరీతంగా తాగాడు. తాగిన మైకంలో గొడవకు దిగాడు. ఇది వెస్ట్రన్ మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. ఇది ఒక రకంగా ఇంగ్లాండ్ క్రికెట్ మేనేజ్మెంట్ తల వంపులకు కారణమైంది. అందువల్లే స్టోక్స్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతడు వన్డే ఫార్మాట్.. టి 20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు.

ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆడింది. అంత గొప్పగా ప్రదర్శన చేయలేకపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఒక మ్యాచ్లో గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఒక క్లబ్ లోకి వెళ్ళింది. అక్కడ స్టోక్స్ పీకల దాకా మద్యం తాగి రచ్చ రచ్చ చేశాడు. ఈ వ్యవహారం మొత్తం మీడియాలో ప్రసారమైంది. అప్పుడే ఇతడి మీద ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ వేటు వేస్తుందని ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ.. మేనేజ్మెంట్ చర్యలు తీసుకునే విషయంలో వెనుకడుగు వేసింది. దానిని ఆసరాగా తీసుకున్న స్టోక్స్ మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. చివరికి మేనేజ్మెంట్ కన్నెర్ర చేయడంతో రిటైర్మెంట్ తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version