Sydney Test : బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. నాలుగు టెస్టులు ముగిశాయి. చివరి టెస్టు సిడ్నీ లో జరుగనుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మొదటి టెస్టు భారత్ గెలవగా, రెండో టెస్టు డ్రా అయింది. మూడు, నాలుగో టెస్టులను ఆస్ట్రేలియా గెలిచి 2–1 ఆధిక్యంలో ఉంది. కీలకమైన ఐదో టెస్టు మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. ఇందులో గెలుపుపైనే భారత్, ఆస్ట్రేలయా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇరు జట్లు చివరి టెస్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆస్ట్రేలియా ఎంసీజీ టెస్టు కోసం కీలక మార్పు చేసింది. పేలవ ఫాంతో ఇబ్బంది పడుతున్న మార్ష్‌ను తొలగించింది. అతని స్థానంలో బ్యూ వెబ్‌స్టర్‌ను ఎంపిక చేసింది. తొలిసారి ఇతనికి టెస్టు జట్టులో స్థానం కల్పించింది. బాక్సింగ్ డే టెస్ట తర్వాత మార్స్ కూడా పక్కటెముకల నొప్పి ఉందని తెలుపడంతో మార్పు అనివార్యమైంది.
ఫాంలో లేని మార్ష్..
ఇదిలా ఉంటే మార్ష్ ప్రస్తుతం ఫాంలో లేడు. తాను ఆడిన చివరి ఐదు ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్ చేయలేదు. కేవలం 33 పరుగుల మాత్రమే చేశాడు. ఇక పెర్తు టెస్టు తర్వాత బౌలింగ్‌లో కూడా వేగం తగ్గింది. ‘మిచ్చి స్పష్టంగా ఈ సిరీస్‌లో పరుగులు చేయలేదు. బహుశా వికెట్లు తీయలేదు,‘ అని కమిన్స్ టెస్ట్ సందర్భంగా చెప్పాడు. ‘కాబట్టి ఇది ఫ్రెష్ అప్ కోసం సమయం ఆసన్నమైందని మేము భావించాము మరియు బ్యూ గొప్పగా ఉన్నాడు. ‘మిచ్చికి ఇది అవమానకరం, ఎందుకంటే అతను జట్టుకు ఎంత అందిస్తాడో మాకు తెలుసు, కానీ ఇప్పుడు బ్యూకి అవకాశం రావడం మంచి వారమని భావిస్తున్నాను’ అని వెల్లడించాడు.
బ్యూ వెబ్‌స్టర్ ఇలా..
ఇదిలా ఉంటే.. టెస్టు జట్టలోకి కొత్తగా వచ్చిన బ్యూ వెబ్‌స్టర్ టాస్మానియా ఆల్‌రౌండర్. 2022, మార్చి నుంచి ఫస్ట్–క్లాస్ క్రికెట్‌లో 57.1 సగటుతో ఉన్నాడు, అదే సమయంలో 31.7 సగటుతో 81 వికెట్లు తీశాడు. గత సంవత్సరం, 31 ఏళ్ల వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తర్వాత షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో 900 పరుగులు మరియు 30 వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌కు ముందు, అతను మాకేలో జరిగిన మొదటి నాలుగు–రోజుల గేమ్‌లో భారతదేశం అకి వ్యతిరేకంగా ఆస్ట్రేలియా అ తరపున అజేయమైన హాఫ్ సెంచరీ చేసాడు మరియు మెల్‌బోర్న్‌లో జరిగిన రెండవ మ్యాచ్‌లో రెండు మూడు వికెట్లు తీసుకున్నాడు.
బ్యూపై మార్ష్ ప్రశంసలు..
కొత్త ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్న్‌పై మిచెల్ మార్స్ ప్రశంసలు కురిపిచాడ. ‘బ్యూ కోసం నిజంగా సంతోషిస్తున్నాను అన్నాడు. ‘బ్యూ అక్కడికి వెళ్లి ఒక క్రాక్ ఇవ్వడానికి నేను వేచి ఉండలేను‘ అని కమ్మిన్స్ చెప్పాడు. ‘ముఖ్యంగా ఇక్కడ ఆస్ట్రేలియాలో, ఒక బ్యాటర్ తప్పిపోయినప్పుడు లేదా పడిపోయినప్పుడు, అది ఎల్లప్పుడూ పెద్ద విషయంగా భావించబడుతుంది. కానీ ్రఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, సెలెక్టర్లు, తాను చూసే విధానం ఏమిటంటే, మేము ఒక జట్టును లాగడాన్ని ఇష్టపడతాము. అని తెలిపాడు
తుది జట్టు..
ఐదో టెస్టు కోసం ఆస్ట్రేలియా లెవన్: సామ్ కొన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్ .
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Beau webster to replace mitchell marsh for scg test
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com